మహూర్యే ఏకవీరీకా దేవి (రేణుకాదేవి |
అష్టాదశ శక్తిపీఠాలలో 8 వ శక్తిపీఠం అయిన ఏకవీరికా దేవి ఆలయం మహారాష్ట్రలోని మాహూర్ ప్రాంతంలో ఉంది. సతీదేవి కుడిబుజం పడిన ప్రాంతంగా భావిస్తారు. ఈ ఆలయం ఇక్కడ పెన్ గంగ గా పిలవబడే పంచగంగా నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం అంతా సింధూరం రంగులో ఉంటుంది. ఆ ప్రాంతంలో ఉన్న పొలాల్లో చాలా చిన్నగా ఉంటుంది ఈ ఆలయం. ఇక్కడ ప్రజలు ఏకవీరికా దేవినే రేణుకా దేవిగా పూజలు చేస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహం ముఖం మాత్రమే ఉంటుంది. ఈ ఆలయం లో ఒకప్రక్క యజ్ఞపీఠం మరోప్రక్క ఊయల ఉంటాయి. ఆ ఊయలలో పరశురామ విగ్రహం ఉంటుంది. పరశురాముని తల్లి, జమదగ్ని మహర్షి భార్య రేణుకాదేవి. ఒకనాడు జమదగ్ని మహర్షి ఆశ్రమానికి కార్తవీర్యార్జునుడు వచ్చి తనకు ఆతిథ్యం స్వీకరిస్తాడు. కార్తవీర్యార్జునుడు తో పాటు తన సైన్యం కూడా ఉంటారు. వాళ్ళకి ఏ లోటు రాకుండా ఎవరికి ఏం కావాలో అది వాళ్ళు తలుచుకోగానే వాళ్ళకి అందుతుంది. వారికి సకల మర్యాదలు చేస్తారు జమదగ్ని మహర్షి. ఇందంతా చూసిన కార్తవీర్యార్జునుడు ఆశ్చర్యంగా మీరు మహర్షులు పైగా అడవిలో ఉంటున్నారు. ఇవన్నీ మీకు ఎలా సాథ్యం అని అడగ్గానే. కామధేనువు సాయంతో నేను ఇందంతా చేయగలిగాను అని చెప్తారు. అయితే కామధేనువు ఉండవలసినది రాజు అయిన నా దగ్గరే గాని మహర్షులు మీ దగ్గర ఎందుకు అని జమదగ్ని మహర్షిని చంపి బలవంతంగా కామధేనువు ను తీసుకుని వెళ్ళి పోతాడు. రేణుకా దేవి చనిపోయిన భర్త దగ్గర కూర్చొని ఏడుస్తుంది. తరువాత అక్కడకు వచ్చిన పరశురాముడు జరిగినది తెలుసుకుని కార్తవీర్యార్జునున్ని, తన సైన్నాన్ని తన గొడ్డలి తో ఒక్కడే యుద్ధం చేసి సంహరిస్తాడు. అలాగే తన తల్లి చనిపోయిన భర్త దగ్గర కూర్చొని 21 సార్లు గుండెలు బాధుకుని ఏడ్చింది అని పరశురాముడు 21 మార్లు భూమిని చుట్టి అన్యాయంగా పాలిస్తున్న రాజులందరినీ చంపేస్తాడు. తరువాత శాంతించి తన తండ్రికి దహనసంస్కారాలు చేస్తాడు. రేణుకాదేవి కూడా సహగమనం చేస్తుంది. అది చూసి పరశురాముడు తట్టుకోలేకపోతాడు. అప్పుడు ఆకాశవాణీ పరశురామునితో నీ తల్లి తిరిగి భూమి నుండి బ్రతుకుతుంది. కాకపోతే వెనకకు తిరిగి చూడకూడదు అని చెప్తుంది. తను కుతూహలంతో పరశురాముడు తిరిగి చూస్తాడు అప్పటికి రేణుకాదేవి ముఖం మాత్రమే భూమి నుండి తిరిగివస్తుంది. అందుకే ఇప్పటికీ ఆ ఆలయంలో రేణుకాదేవి ముఖం తప్ప మొండెం ఉండదు. ఆ ముఖానికి వివిధ ఆభరణాలతో పూజలు నిర్వహిస్తారు. చెవి పోగులు, బంగారు మాాలలు, ముక్కు పొడి, ఉంగరం మొదలైన ఆభరణాలు అమ్మవారికి అలంకరించి ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలోనే పరశురామ ఆలయం ఉంది. పరశురామ కుండ్ అనే పవిత్రమైన చెరువు ఉంది. ఇక్కడే దత్తాత్రేయ స్వామి ఆలయం, అత్రి మహర్షి, అనసూయ మాత ఆలయం ఉంటుంది. ఇక్కడే మాతృతీర్థం అనే చెరువు ఉంది. ఈ పరిసర ప్రాంతంలోనే జమదగ్ని మహర్షి దహనసంస్కారాలు చేసారు పరశురాముడు. దత్తాత్రేయ స్వామి శయన మందిరం ఉంది. దీనినే దేవదేవేశ్వర మందిరం అంటారు. దత్తాత్రేయ స్వామి కాశీ గంగా నదిలో స్నానం చేసి, కౌల్హాపురి లో భిక్ష చేసి, మహూర్ లో నిద్రిస్తారు అని నమ్మకం. చింతామణి గణేష్ దేవాలయం ఉంది. ఈ ఆలయ ప్రత్యేకత దేవుడు దక్షిణాభిముఖంగా ఉన్న ఏకైక దేవాలయం ఇదే. ఈ ఆలయం నేలమట్టానికి 20 అడుగుల దిగువన ఉంది. ప్రతీ 12 సంవత్సరాలకి ఒకసారి ఈ ఆలయం నీటిలో మునుగుతుంది.