రామునికి ఉన్న పేర్లు వాటి గొప్పతనం



రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే

రఘునాధాయ నాధాయ సీతాయాః పతయే నమః


ఈ ఒక్క శ్లోకంలోనే రామునికి ఎన్ని పేర్లు ఉన్నాయో తెలుస్తుంది. రామ ర అనే భీజాక్షరం ఓం నమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో నుండి, మ అనే భీజాక్షరం ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రం లో నుండి తీసుకుని వశిష్ఠ మహర్షి రామ అనే పేరు పెట్టారు. అగ్ని తత్వం, అమృత తత్వం కలిగిన ఈ రామనామం అందరి పాపాలను అగ్నిలా కాల్చివేసి అమృత తత్వమయిన పుణ్యాన్ని చేకూరుస్తుంది. అందుకే రామ అనే పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. రామభద్రాయ రాముడు ఎప్పుడూ భద్రంగా చూసుకుంటాడు అంటే లోకానికి క్షేమం కలిగించేవాడు అని. రామచంద్రాయ చంద్రునికి 16 కళలు ఎలాగో రామునికి కూడా 16 లక్షణాలు ఉన్నాయి. ఆ 16 లక్షణాల వల్లనే రాముడు దేవుడయ్యాడు. ఆ 16 లక్షణాలు ఉన్నవాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా అని వాల్మీకి మహర్షి నారధున్ని అడుగుతాడు. 


కోన్వస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చవీర్యవాన్|

ధర్మజ్ఞస్ఛ కృతజ్ఞశ్చ సత్యవాక్యో ధృఢవ్రతః||

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కోహితః|

విధ్వాన్  కః కః సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః||

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయకః|

కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే||


1)మంచి గుణములు కలిగినవాడు, 2) వీరుడు, 3)ధర్మము కలిగిన వాడు, 4)కృతజ్ఞత స్వభావము కలిగినవాడు, 5)ఎల్లప్పుడూ సత్యాన్ని పలికేవాడు, 6)పట్టుదల ఉన్నవాడు, 7)చారిత్రము కలిగినవాడు, 8)బుద్దిమంతుడు, 9)అన్ని జీవులను సమానంగా చూసేవాడు, 10)విధ్యావంతుడు, 11)సమర్ధుడు, 12)చూడగానే శాంతంగా కనిపించేవాడు, 13)అన్ని విషయాల్లో పాండిత్యము కలిగివాడు, 14)క్రోధాన్ని జయించినవాడు,  15)కోపంవస్తే దేవతలనైనా భయపెట్టగలవాడు, 16)అందరికీ ఇష్టమైనవాడు ఇలా 16 లక్షణాలు కలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అన్న ఒక్క ప్రశ్న మనకు మహాద్భుతమైన రామాయణాన్ని అందించింది. 

వేధసే వేదమే రామాయణము వేదవేధ్యుడే రాముడు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. పురుషులు కూడా అందునా అన్నింటినీ వదిలిపెట్టిన మహర్షులే రామున్ని చూసి మోహించేవారంట. అంటే వేదాలను మహర్షులు ఎప్పుడూ పఠిస్తుంటారు కాబట్టే మహర్షులకు రాముడుంటే ఇష్టం అని దాని అర్థం.

రఘునాధాయ రఘు వంశ ప్రతిష్ఠను ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళాడు కాబట్టే రఘునాధుడు.

నాధాయ నాథా అని ఒక్క సీతమ్మ తల్లి మాత్రమే పిలవగలదు.

సీతాయాపతయే నమః సీత అయోనిజ అయినా కూడా రామునితో పాటు తను కూడా అనుసరించి ఎన్ని కష్టాలు పడినా కూడా ఎప్పుడూ రామున్ని వదిలిపెట్టలేదు. అరణ్యానికి వెళ్ళవలసిన అవసరం లేకపోయినా కూడా రామునితో కలిసి రామునికి తోడ,నీడ గా ఉంది కాబట్టి సీతాపతి. ఈ అన్ని పేర్లు ఉన్న రామునికి నమస్కారం అని ఆ శ్లోకార్థం.

కొత్తది పాతది