నాగేశ్వరస్వామి విగ్రహం చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. |
సాగరపశ్చిమ తీరాన 16 యోజనాల ప్రాంతంలో ఒక అడవి ఉంది. ఆ అడవిలో దారుక అనే రాక్షస దంపతులు ఉండేవారు. అక్కడ నివసించే ఋషులంతా దారుకా రాక్షసుని వేధింపులకు తాళలేక ఓవర మునిని ఆశ్రయించారు. ఓవర ముని ఆ రాక్షసున్ని చనిపొమ్మని శపించాడు. దేవతలంతా ఆ రాక్షసునిపై దండెత్తి రాగా, ఆ రాక్షసుడు తనకు తాను రక్షించుకోవటానికి మార్గాలు వెతికాడు. తన భార్య దారుక రాక్షసికి పార్వతీదేవు ఇచ్చిన శక్తితో ఆ అడవితో సహా దారుకాసురుడు ఎగురుతూ సముద్రం మధ్యలో ఆ అడవిని స్థాపించాడు. ఇప్పుడు ఆ రాక్షసుడు సురక్షితంగా ఉంటానని భావించాడు. తరువాత ఒక పడవ సహాయంతో ఆ ఋషులను బంధించటానికి బయలుదేరాడు. ఆలా బంధింపబడిన వారిలో సుప్రియా అనే గొప్ప శివభక్తి కలిగిన ఆమె ఉంది. సుప్రియను కూడా చెరసాలలో బందించాడు. కానీ సుప్రియా ఆ చెరసాలలోనే శివుణ్ణి ఆరాధిస్తూ ఉంది.
అప్పుడు చెరసాల కాపలాదారులు దారుకాసురుడుకి చెప్తే ఆమెను చంపెయ్యమని ఆజ్ఞాపించాడు. సుప్రియా శివుణ్ణి ఆరాధిస్తూనే ఉంది. అప్పుడు శివుడు అక్కడ ప్రత్యక్షమై ఒక్క క్షణంలో అక్కడున్న రాక్షసులను, వారి కుటుంబ సభ్యులను అందరినీ చంపివేసి, ఆ ఆడవిని ప్రజల సంక్షేమార్థం తెరిచాడు. పార్వతీదేవి ప్రసాదించిన శక్తుల వల్ల ప్రస్తుత కాలం అంతమైన తరువాత సృష్టిని రాక్షసులే చేస్తారు. ద్వారిక దాని రాణి అవుతుంది. శివుడు దీనినంగీకరించి, నాగేశ్వరుడనే పేరుతో తానే స్వయంగా వెలిసాడు. పార్వతీదేవి కూడా నాగేశ్వరీ అనే పేరుతో వెలిసింది. ఈ నాగేశ్వర క్షేత్రం గుజరాత్ లోని ద్వారకకు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది.