ఒకానొక సమయంలో నారద మహర్షి గోకర్ణ తీర్థం వెళ్ళి అక్కడ శివుని పూజించి తరువాత వింధ్యాచల పర్వతాలకు వెళ్ళి అక్కడ మరల శివుని ఆరాధించాడు. ఇది చూసి వింధ్యాచల పర్వతాలు నారదుని దగ్గరకు వచ్చి ఓ నారద మహర్షి నేేను చాలా గొప్పవాడిని కదూ అని అనడంతో, నారదుడు ఎలాగైనా వాటి గర్వం అణచివేయాలని నీ కన్నా మేరు పర్వతం ముందు నువ్వు ఎందకూ పనికి రావు, మేరు పర్వతాన్ని భగవంతునితో సమానంగా లెక్కిస్తారు అని అంటాడు. అప్పుడు వింధ్యాచలం ఓహో నాకంటే మేరు పర్వతం ఎత్తైనది అనుకుని శివుని విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుని నిరంతరం ఆరాధిస్తూ ఉంటుంది. తన భక్తికి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగుతాడు. ఆ మాటకు వింధ్యాచలుడు తన పర్వతం పైన జ్యోతిర్లింగంగా ఆవిర్భవించమని కోరుకుంటాడు. ఆ కోరికకు పరమశివుడు సంతోషించి ప్రణవాకారంగా ఆవిర్భవిస్తాడు. అందుకే ఆ క్షేత్రానికి ఓంకారేశ్వర క్షేత్రంగా పేరువచ్చింది. ఉజ్జయిని క్షేత్రంలో మొదటి అంతస్థులో మహాకాలేశ్వరుడు, రెండవ దానిలో ఓంకారేశ్వరుడు ఉంటే ఈ క్షేత్రంలో మాత్రం క్రింద అంతస్థులో ఓంకారేశ్వరుడు మొదటి దానిలో మహాకాలేశ్వరుడు ఉంటారు. ఈ ఆలయం 4 అంతస్థులలో ఉంటుంది. క్రింద ఓంకారుడు, మొదటి దానిలో మహాకాలేశ్వరుడు, మిగతా అంతస్థులలో ఉపఆలయాలు శివుడు, అమ్మవారు ఉంటారు. ఈ క్షేత్రంలో శివలింగంలో చిన్న చీలిక ఉండి అభిషేక జలం అక్కడ ఉన్న నర్మదా నదిలో కలుస్తుంది. అంతేకాకుండా ఇక్కడ నర్మదా, కావేరి కలిసి క్రింద సరస్వతీ నది అంతర్వాహినిగా కలిసి త్రివేణి సంగమం గా వ్యవహరించబడుతుంది. అన్ని నదులు తూర్పు గా ప్రవహించి బంగాళాఖాతం లో కలిస్తే ఇక్కడ నర్మదా నది పడమరగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ఆలయం ఆకాశం పై నుండి చూస్తే ఓం ఆకారంలో కనబడుతుంది. ఈ నదీ ఇవతల ఒడ్డున ఉన్న ఆలయంలో స్వామి అమలేశ్వరునిగా దర్శనం ఇస్తారు. ఈ వింధ్యాచల పర్వతం పై సూర్యవంశంలో పుట్టిన రఘువంశానికి మూల పురుషుడు, శ్రీరాముల వారి పూర్వీకుడు అయిన మాంధాత ఇక్కడే తపస్సు చేసి పరమశివుని అనుగ్రహం పొందారు. అందుకే దీనిని మాందాతృపురి అని కూడా అంటారు. ఈ ఓంకారేశ్వర క్షేత్రం మధ్యప్రదేశ్ లో ఖండ్వా జిల్లాలో ఉంది.
- Home
- ద్వాదశ జ్యోతిర్లింగాలు చరిత్ర
- __సౌరాష్ట్ర సోమనాథుడు
- __శ్రీశైలం మల్లిఖార్జున స్వామి
- __ఉజ్జయినీ మహంకాళేశ్వరుడు
- __ఓంకారం అమలేశ్వరుడు
- __బైధ్యనాథుడు
- __ఢాకిన్యాం భీమశంకరుడు
- __రామేశ్వరుడు
- __దారుకావనం నాగేశ్వరుడు
- __వారణాశి విశ్వేశ్వరుడు
- __త్య్రంబకేశ్వరుడు
- __కేధారేశ్వరుడు
- __ఘృష్ణేశ్వరుడు
- అష్టాదశ శక్తిపీఠాలు చరిత్ర
- __లంకాయాం శాంకరీదేవి
- __కంచి కామాక్షిదేవి
- __ప్రద్యుమ్నం శృంఖలాదేవి
- __క్రౌంచపట్టణం ఛాముండేశ్వరీదేవి
- __అలంపురీ జోగులాంబదేవి
- __శ్రీశైలం భ్రమరాంబికాదేవి
- __కౌల్హాపురీ మహాలక్ష్మిదేవి
- __మహూర్యే ఏకవీరికా దేవి
- About