ఉజ్జయిన్యాం మహంకాళం, ఓంకార మమలేశ్వరమ్
ప్రజ్వల్యామ్ వైధ్యనాదంచ, ఢాకిణ్యాం భీమశంకరమ్
సేతుబందేతు రామేశం, నాగేశం ధారుకావనే
వారనాస్యంతు విశ్వేశం, త్య్రంబకం గౌతమీతటే
హమాలయేతు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్తజన్మకృతంపాపం స్మరనేన వినస్యతి||
గుజరాత్ లో సోమనాధునిగా, శ్రీశైలం లో మల్లికార్జునిగా, ఉజ్జయినీలో మహంకాళుడిగా, ఓంకార క్షేత్రంలో అమలేశ్వరునిగా, దేవఘర్ (బీహార్)లో వైధ్యనాథునిగా, డాకినీ లో భీమశంకరునిగా, సేతువు కట్టిన రామేశ్వరంలో రామేశ్వరునిగా, ద్వారక దగ్గర నాగేశ్వరునిగా, వారణాసి క్షేత్రంలో విశ్వేశ్వరునిగా, గౌతమీ నదీ(నాసిక్) తీరాన త్య్రంబకేశ్వరునిగా, హిమాలయాలలో కేదారేశ్వరునిగా, ఔరంగబాద్(మహారాష్ట్ర)లో ఘృష్ణేశ్వరుడు(కుసుమేశ్వరుడు) గా ఆ పరమశివున్ని ఉదయం, మధ్యహ్నం, రాత్రి అని తేడా లేకుండా ఈ 12 జ్యతిర్లింగాలను తలుచుకుంటే ఏడేడు జన్మల పాపం పోతుంది. 12 క్షేత్రాలలో 12 లింగాలతో ఆ పరమశివుడు భక్తులకు అనుగ్రహం ఇవ్వడానికి తనంతట తానే వచ్చి వెలిసిన ఈ జ్యోతిర్లింగాలు ఏంతో ప్రాముఖ్యత కలిగినవి. మన సనాతన ధర్మంలో ఈ ఒక్కొక్క జ్యోతిర్లింగానికి ఒక్కొక్క కథ ఉంది. పరమశివుడు భక్తుల కోరిక మేరకు భక్తులను కాపాడటానికి వారిని రక్షించడానికి భక్త సులభునిగా తానే స్వయంగా వచ్చి వెలిసిన ఈ క్షేత్రాల గురించి మనం తెలుసుకుంటే చాలు మనం స్వయంగా ఆ క్షేత్రాలు దర్శనం చేసుకున్నంత పుణ్యం కలుగుతుంది.