హుగ్లీలో ఉన్న శృంఖలాదేవి ఆలయం |
అష్ఠాదశ శక్తి పీఠాలలో మూడవదైనది ప్రద్యుమ్నే శృంఖలాదేవి. ఈ ఆలయం పశ్చిమబెంగాళ్ రాష్ట్రం హుగ్లీ జిల్లా లోని పాండువా లో ఉంది. ఇక్కడ సతీదేవి కడుపు బాగం పడింది. ఇంకొక కథనం ప్రకారం ఋష్యశృంగ మహర్షి ఇక్కడ తపస్సు చేసి అమ్మవారి ఆజ్ఞానుశారం శృంఖలాదేవిని కర్ణాటకాలో శృంగేరి కి తీసుకుని వెళ్ళారని చెప్పుకుంటారు. పశ్చిమబెంగాళ్ లో అసలు గుడి లేదని ఆ ప్రాంతంలో ముస్లింలు కట్టిన ఒక స్థూపం మాత్రం ఉంది అది Archaeology Department వాళ్ళు దానిని స్వాధీనం చేసుకున్నారు. ఇంకొంత మంది అభిప్రాయం ప్రకారం శృంఖలాదేవి ఆలయం గుజరాత్ లో చొటిల్లా లో ఉందని అంటుంటారు. కానీ ఎక్కువ మంది మాత్రం పశ్చమిబెంగాళ్ హుగ్లీ లో ఉన్న ఆలయమే శృంఖలా దేవి ఆలయంగా భావిస్తారు. శృంఖలా అంటే ప్రసవానంతరం తల్లి పొత్తికడుపుకు కట్టుకునే గుడ్డ అని అర్థం. ఈ రూపంలో ఆ తల్లి మొత్తం ఈ విశ్వాన్ని తన బిడ్డగా చూసుకుని రక్షిస్తుంది. ప్రతీ సంవత్సరం మాఘమాసం లో మేళతాళ అనే పేరుతో 30 రోజుల పాటు ఇక్కడ పండుగ చేస్తారు. ఈ పండుగలో హిందువులే కాకుండా ముస్లింలు కూడా పాల్గొని పండుగ చాలా ఘనంగా చేస్తారు. లక్షమంది వరకూ ఈ పండుగ చూడడానికి వస్తారు. పాండువా లోనే ఇంకొక దేవాలయం ఉంది. హన్సేశ్వరీమాత అనే దేవాలయాన్ని కూడా ఇక్కడ శక్తిపీఠాలలో ఒకటిగా భావిస్తారు. ఋష్యశృంగ మహర్షి చిన్నతనం నుండి తన తండ్రి, ఆ ఆశ్రమం తప్ప ఇంకొక ప్రపంచం ఉంటుందని తెలియకుండా పెరుగుతారు. తన ప్రశాంతమైన, నిశ్కల్మషమైన మనస్సుతో ఆ శృంఖలా దేవిని నిత్యం ఆరాధిస్తూ ఉంటారు. అటువంటి భక్తి కలిగిన వారు కాబట్టే ధశరథ మహారాజు ఆయన చేత పుత్రకామేష్ఠి యాగం చేస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని వశిష్ఠ మహర్షి ధశరథ మహారాజు కు చెప్తారు. ధశరథ మహారాజు స్నేహితుడైన రోమపాదుని కుమార్తె అయిన శాంతాదేవి ని ఇచ్చి వివాహం చేసుకున్న తరువాత భార్యా సమేతంగా దశరథ మహారాజు దగ్గరకి వచ్చి తన చేత పుత్రకామేష్ఠి యాగం చేయిస్తారు. కొన్ని రోజుల తరువాత శృంఖలాదేవి ఆజ్ఞానుసారం ఆ తల్లిని శృంగేరిలో ఆలయాలు నిర్మించి అక్కడ అమ్మవారిని ప్రతిష్టించారు. ఆ అమ్మవారి శక్తిని అక్కడ ఉన్న శృంగ పర్వతాల చుట్టూ నిక్షేపించారు. అక్కడ నిర్మించిన ఆలయాలను కూడా శక్తిపీఠాలుగా కొలుస్తారు.