చాముండేశ్వరీ దేవి, క్రౌంచపట్టణం

 

చాముండేశ్వరీదేవి ఆలయం, కర్ణాటక
అష్టాదశ శక్తిపీఠాలలో నాలుగవదైన చాముండేశ్వరీదేవి ఆలయం కర్ణాటక రాష్ట్రంలో మైసూరులో చాముండీ కొండపై కొలువుదీరి ఉంది. దీనినే క్రౌంచపీఠం అంటారు. మైసూరు పాలెస్ కు 13 కిలోమీటర్ల దూరంలో ఉండే 3300 అడుగుల ఎత్తైన చాముండీ కొండ పై 12 వ శతాబ్దంలో హోయసల రాజవంశం వారు ఈ చాముండేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్టించారు. తరువాత 17 వ శతాబ్దంలో విజయనగర రాజవంశస్ధులు గోపురాన్ని నిర్మించి, ఆ కొండపైకి వెళ్ళడానికి 3000 మెట్లు నిర్మించారు. 700 వ మెట్టు దగ్గర 2 వ శతాబ్దంలో కట్టిన 15 అడుగుల పొడవు 24 అడుగుల వెడల్పు గల పెద్ద నంది విగ్రహం ఉంటుంది. అక్కడే శివుని ఆలయం కూడా నిర్శించారు. ఆ చాముండీ కొండపై మహిషారుడనే రాక్షసున్ని సంహరించి అక్కడే అమ్మవారు చాముండేశ్వరీ రూపంలో కొలువై ఉంది. మహిషాసురుడు పాలించబడిన ప్రదేశం కాబట్టి మహిషూరు అనేవారు. కాలాంతరంలో అది మైసూర్ అని ఇప్పడు మైసూరు అని పిలుస్తున్నారు. ఇక్కడ సతీదేవి జుట్టు పడినట్టుగా భావిస్తారు. చాముండీ కొండ దిగువన పాదాల వద్ద ఉత్తనహలీ అనబడే దగ్గర జ్వాలామాలినీ శ్రీ త్రిపురసుందరీ ఆలయం కూడా ఉంది. ఇక్కడ ఉన్న అమ్మవారు చాముండేశ్వరీ దేవి సొదరిగా భావిస్తారు. యుద్ధంలో రక్తభీజ అనే రాక్షసున్ని చంపడానికి అమ్మవారికి సహాయం చేసింది. 
2వ శతాబ్ధంలో కట్టిన అతిపెద్ద నంది

ఈ ఆలయం లో ఆషాడ శుక్రవారం, దేవీనవరాత్రులు, అమ్మనవర వర్థంతి అని ఆషాడమాసంలో  చాలా ఘణంగా పూజులు నిర్వహిస్తారు. మైసూరు సామ్రాజ్యాన్ని పరిపాలించిన ముస్లిం రాజు టిప్పుసుల్తాన్ తండ్రి అయిన హైదర్ అలీ చాముండేశ్వరీ దేవికి చాలా రకాల ఆభరణాలు, వస్త్రాలు సమర్పించారు. తరువాత టిప్పుసుల్తాన్ కూడా ఆ ఆచరాన్ని కొనసాగించారు. దసరా పండుగ సమయంలో 7 వ రోజు కాళికా దేవి రూపంలో అమ్మవారికి ఆ ఆభరణాలను అలంకరిస్తారు. దసరా పండుగ ముగిసిన కొన్నిరోజులకు ఆ ఆభరణాలన్నీమళ్ళీ ఖజానాకు తీసుకునివెళ్తారు. చాముండేశ్వరీదేవికి సమర్పించిన కొన్ని ఆభరణాలు శ్రీకంఠదత్ నరసింహరాజ ఒడయార్ దగ్గర ఉంచుకుని వాటిని దసరా సంధర్భంలో ఆలయానికి సమర్పిస్తూ ఉండటం ఇక్కడ ఆచారంగా వస్తుంది. మరికొన్ని ఆభరణాలు ప్రభత్వ ఆధీనంలో ఉంటాయి. ఈ ఆభరణాలలో బంగారం, వెండి, ముత్యాలు, రత్నాలతో పొదగబడి ఉంటాయి. ఈ ఆభరణాల వెల కట్టడానికి ఇప్పటికీ ఎవరితరం కాలేదు. ఇప్పటికీ ఒడయార్ వంశస్ధుల దగ్గరే ఆ ఆభరణాలు ఉంచబడి దసరా పండుగ సమయంలో వాటిని అమ్మవారికి సమర్పించడం ఇక్కడ ఆచారంగా వచ్చింది. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలు చాముండేశ్వరీ అమ్మవారిని నాడదేవి (అంటే రాష్ట్రానికి దేవతగా) పిలుస్తారు. 

కొత్తది పాతది