నవరాత్రి మొదటి రోజు శైలపుత్రీదేవి అవతార విశేషాలు



 భారతదేశంలో అత్యంత వైభవంగా చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. దసరా వస్తుందంటే చాలు అందరూ ఎంతో ఆనందంతో చేసుకుంటారు. ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షం విదియ మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు నవరాత్రులుగా పూజాకార్యక్రమాలు చేసుకుని. పదవ రోజు చెడుపై మంచి విజయం సాధించినట్టుగా విజయ దశమి చేసుకుని అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా అంటే అటు పిల్లలకు ఇటు పెద్దలకు ఎంతో ఆనందం. అమ్మవారిని తొమ్మిది రూపాలలో తొమ్మిది రోజులు నవరాత్రుల పేరుతో జరుపుకునే పండుగ. భారతదేశంలో అత్యంత వైభవంగా చాలా ఘనంగా జరుపుకునే పండుగలలో దసరా ఒకటి. దసరా వస్తుందంటే చాలు అందరూ ఎంతో ఆనందంతో చేసుకుంటారు. ఆశ్వీయుజ మాసం శుక్ల పక్షం విదియ మొదలు నవమి వరకు తొమ్మిది రోజులు నవరాత్రులుగా పూజాకార్యక్రమాలు చేసుకుని. పదవ రోజు చెడుపై మంచి విజయం సాధించినట్టుగా విజయ దశమి చేసుకుని అమ్మవారిని ఆరాధిస్తారు. దసరా అంటే అటు పిల్లలకు ఇటు పెద్దలకు ఎంతో ఆనందం. అమ్మవారిని తొమ్మిది రూపాలలో తొమ్మిది రోజులు నవరాత్రుల పేరుతో జరుపుకునే పండుగ. 

అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా బె

ద్దమ్మ సురారులమ్మ కడుపారడి వుచ్చిన యమ్మ తన్నులో

నమ్మిన వేల్పుటంబున మనమ్మున యుండెడి యమ్మ దుర్గ మా

యమ్మ కృపాబ్థి యిచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్


ముగ్గురమ్మ లకి మూలం అయిన దుర్గాదేవి మొదటి మూడు రోజులు పార్వతీదేవిగా, తరువాత మూడురోజులు లక్ష్మీదేవిగా, ఆఖరి మూడురోజులు సరస్వతీ దేవిగా అందరికీ దర్శనం ఇస్తుంది. 


ప్రధమం శైలపుత్రిణి, ద్వితీయం బ్రహ్మచారిణి

తృతీయం చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్దామ్ ||

పంచమం స్కంధమాతేతి, షష్ఠమం కాత్యాయనీ తిచ

సప్తమం కాళరాత్రంచ, మహాగౌరేతి చాష్టమం

నవమం సిద్దితి ప్రోక్త, నవదుర్గ ప్రకీర్తిత. 


మొదటి రోజు శైలపుత్రీ, రెండవరోజు బ్రహ్మచారిణి, మూడవరోజు ఛంద్రఘంట, నాల్గవరోజు కూష్మాండ, ఐదవరోజు స్కంధమాత, ఆరవరోజు కాత్యాయని, ఏడవరోజు కాళరాత్రి, ఎనిమిదవరోజు మహాగౌరి, తొమ్మిదవరోజు సిద్ధిధాత్రి  గా తొమ్మిది రోజులు తొమ్మిది రూపాలతో అమ్మవారిని అలంకరించి పదవ రోజు రాజరాజేశ్వరీదేవిగా అమ్మవారికి పూజాకార్యక్రమాలు చేస్తారు.  వర్షఋతువు వెళ్ళిపోయి, శరదృతువు ప్రారంభం అవుతుంది. వర్షాకాలం వచ్చేసరికి ఎక్కువగా రోగాలు బారిన పడతారు. అందులో నుండి ఉపశమనం పొంది అమ్మవారి ఆశీస్సులతో సంతోషంగా, ఆనందంగా, సుఖంగా జీవించే విధంగా ప్రారంభం అవుతాయి శరన్నవరాత్రులు. రేపటి నుండి ప్రారంభం అయ్యే శరన్నవరాత్రులలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కో రూపంలో మనకు దర్శనం ఇస్తారు.

నవరాత్రులలో అమ్మవారి మొదటిరోజు అవతారంః-


1. శైలపుత్రీః వందే వాంఛితలాభాయ చంద్రార్థకృత శేఖరాం

 వృషారూఢం శూలధరాం శైలపుత్రీం యశస్వీనీమ్


 "వృషభాన్ని అధిరోహించి, కిరీటంలో చంద్రవంకను ధరించి, యశశ్శు కలిగి, భక్తుల మనో వాంఛలను తీర్చే మాతా శైలపుత్రీ దుర్గా దేవికి నా నమస్కారం.


అంటూ నవరాత్రులలో మొదటి రోజు దుర్గాదేవిని శైలపుత్రీ అవతారం లో పూజాకార్యక్రమాలు ప్రారంభిస్తారు. శైలపుత్రీ అంటే పర్వతము యొక్క కూతురు అని అర్థం. ఆ పర్వతం ఎవరూ అంటే హిమవంతుడు. ఆ హిమవంతుని కూతురు ఎవరు పార్వతీ దేవి అందుకే శైలపుత్రీ అని పేరు వచ్చింది. శివుని భార్య, గణపతి, సుభ్రహ్మణ్యస్వామి తల్లి అయిన పార్వతీదేవినే శైలపుత్రీ గా వ్యవహరిస్తారు. ఈ శైలపుత్రీ అవతారం లో అమ్మవారి తలపై చంద్రవంక ఉండి, కుడిచేతిలో త్రిశూలం, ఎడమచేతిలో కమలం ఉన్న ఈ అమ్మవారు వృషభ వాహనం మీద కూర్చొని ఉంటుంది. మహిషాసురున్ని సంహరించేందుకు యుద్ధంలో మొదటిరోజు పరాశక్తి పార్వతీదేవి ఇలా శైలపుత్రీ గా వచ్చింది. 

దాక్షాయణి గా దక్షప్రజాపతి కూతరుగా పుట్టిన సతీదేవి. దక్షయజ్ఞ సమయంలో అవమానపడి ఆత్మాహుతి చేసుకుని మేనకాదేవి, హిమవంతులకు కూతురుగా జన్మించిన పార్వతీ దేవి శైలపుత్రిగా పూజలు అందుకుంటుంది. రుతు చక్రానికి అధిష్టానదేవత శైలపుత్రీదేవి. నంది పై కూర్చుని మూలాధార చక్రానికి తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. శైలపుత్రీదేవిని ఉపాసన చేస్తే మూలాధార చక్రం జాగృతం చేస్తుంది. యోగులు ఈ అమ్మవారిని ఉపాసించి మూలాధాల చక్రంపై దృష్టి కేంద్రీకరించి, ధ్యానిస్తారు. యోగపరంగా నవరాత్రులలో మొదటి రాత్రి చాలా పవిత్రమైనది. ఈ రాత్రి శైలపుత్రీ దుర్గాదేవిని ధ్యానిస్తే ప్రకృతి స్వరూపిణి అయిన దుర్గాదేవిని చేరుకునేందుకు సులభంగా ఉంటుందని నమ్ముతారు. నవరాత్రులలో మొదటిరోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పక్ష పాఢ్యమి ఈ అమ్మవారిని ధ్యానించడం ద్వారా మనం చేసే ఉపాసన సిద్ధిస్తుంది అని నమ్ముతారు.శివపురాణం ప్రకారం ఈ భూమి అంతా శైలపుత్రీదేవిలో ఉంటుంది. అంటే సృష్టి అంతా ఆమే శరీరంలోనే ఉంది. శైలపుత్రీదేవి పృధివీతత్వం కలిగి గుణం, గ్రాహణ, భేద శక్తులతో ప్రకాశిస్తుంది. ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో మర్హీయా ఘాట్ వద్ద శైలపుత్రీదేవి ఆలయం ఉంది. ఇది నవరాత్రులలో మొదటిరోజు అయిన ఆశ్వీయుజ శుక్ల పక్ష పాఢ్యమి న శైలపుత్రీదేవి ని పూజించి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభిస్తారు





కొత్తది పాతది