నవరాత్రులలో ఆరవరోజు కాత్యాయనీదేవి అవతార విశేషాలు



 కాత్యాయనీదేవి

చంద్రహాసోజ్వలకరా శార్థూలవరవాహనా

కాత్యాయనీ శుభం దద్యాదేవి దానవఘాతినీ


నవరాత్రులలో ఆరవరోజు అయిన ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి నాడు దుర్గాదేవిని కాత్యాయనీదేవిగా పూజలు చేస్తారు. పిల్లలు లేని కాత్యాయన మహర్షికి బ్రహ్మ, విష్ణు, శివుల తేజస్సుతో పుట్టిన సంతానం కాబట్టి కాత్యాయనీ అని పేరు వచ్చింది. మహిషాసురున్ని సంహరించడానికి వచ్చిన అవతారం. దేవతలు మహిషారుడి వల్ల ఎన్నో కష్టాలు పడుతున్నారని కాత్యాయన మహర్షి ద్వారా వాళ్ళ తేజస్సుతో అక్కడ జన్మించింది. బ్రహ్మ అక్షమాల, విష్ణువు సుదర్శన చక్రం, శివుడు త్రిశూలం, సూర్యుడు, వాయువు ధనుర్భాణాలు, ఇంద్రుడు పిడుగును, కుబేరుడు గద ఇలా అందరూ దేవుళ్ళు ఒక్కొక్క ఆయుధాన్ని కాత్యాయనీ దేవికి ఇచ్చి మహిషాసురుడ్ని సంహరించమని పంపిస్తారు. అలా వచ్చిన కాత్యాయనీ దేవి అందాన్ని చూసి మహిషాసురుడు మోహిస్తాడు. తనను పొందాలని ఆమె చెయ్యిని పట్టుకోవాలని అడుగుతాడు. అప్పుడు అమ్మవారు తనతో యుద్ధంలో గెలవమని చెప్తుంది. వాడు ఎద్దురూపంలో యుద్ధం చేస్తుంటాడు. అమ్మవారు సింహం పై నుండి ఎగిరి ఎద్దురూపంలో ఉన్న వాడిని తంతుంది. ఆ దెబ్బకు తెలివిలేకుండా నేలపై పడిపోతాడు. అప్పుడు అమ్మవారు తన త్రిశూలంతో  వాడి తలను నరికేస్తుంది. మహిషాసురున్ని చంపింది కాబట్టి మహిషాసురమర్థిని అనే పేరు వచ్చింది కాత్యాయనీ దేవికి. కాత్యాయనీ అవతారం ఖఢ్గం, కమలం పట్టుకుని వరదముద్ర, అభయముద్ర తో నాలుగు చేతులుకలిగి సింహవాహనం పై కూర్చొని ఉంటుంది. ఈ కాత్యాయనీ అవతారాన్ని పూజిస్తే ఎల్లప్పుడూ విజయం కలుగుతూ భయం లేని విధంగా ఉంటుంది. ఇది నవరాత్రులలో ఆరవరోజు కాత్యాయనీదేవి అవతార విశేషాలు.

కొత్తది పాతది