నవరాత్రులలో ఐదవరోజు స్కందమాత అవతారం


 సింహాసనగతా నిత్యం పద్మాశ్రిత కరద్వయా

శుభమస్తు సదాదేవి స్కందమాతా యశస్వినీ

నవరాత్రులలో ఐదవ రోజు అయిన ఆశ్వీయుజ శుధ్ధ పంచమి అమ్మవారిని స్కందమాత అవతారం లో పూజలు చేస్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఇంకోక పేరు స్కందుడు. స్కందుడు తల్లి కాబట్టి స్కందమాత గా పేరు వచ్చింది. సుబ్రహ్మణ్యస్వామి ని ఒళ్ళో కూర్చోపెట్టుకుని కమలం, జలకలసం, ఘంటా, ఒక చేయి అభయముద్ర పట్టి నాలుగు చేతులతో సింహం వాహనం పై కూర్చొని తెల్లగా ఉంటుంది స్కంధమాత అవతారం. శివపార్వతుల వివాహం అనతరం కొన్ని కోట్ల సంవత్సరాలు ఆనందంగా గడుపుతారు. వారికి పుట్టిన సంతానం వల్లనే తారకాసురుడు సంహరించబడతాడని శివపార్వతుల శక్తి ఒకటైనప్పుడు వచ్చిన పిండం తొందరగా బిడ్డగా పుట్టాలని దేవతల కోరిక మేరకు పరమశివుడు తన తేజస్సును అగ్నికి ఇస్తాడు. ఆ తేజస్సును భరించలేని అగ్నిదేవుడు, గంగాదేవికి ఇస్తాడు. గంగాదేవికూడా ఆ పిండాన్ని భరించలేక రెల్లుపొదల్లో వదిలిపెడుతుంది. ఆ పిండం నుండి ఒక బిడ్డపుడతాడు. ఆ బిడ్డను ఆరుగురు కృత్తికలు పోషిస్తుంటారు. తరువాత ఈ విషయం తెలిసిన పార్వతీదేవి తన పిండాన్ని ఇలా చేసారనే కోపంతో దేవతలకు ఎవరికీ పిల్లలు పుట్టకూడదని శాపం ఇస్తుంది. అగ్నిని తన, మన బేధం లేకుండా అన్నింటిని మండిస్తూ ఉండమని శాపం పెడుతుంది. శివుడు పార్వతీదేవి ని శాంతించమని చెప్పి, కుమారస్వామి పుట్టుక గురించి చెప్తాడు. అప్పుడు పార్వతీ దేవి శాంతించి తన బిడ్డను తీసుకుని కైలాసానికి వెళ్తుంది. శివుడు స్కలనం చేయడం వల్ల పుట్టాడు కాబట్టి స్కంధుడు అనే పేరు వచ్చింది. తరువాత సుబ్రహ్మణ్యున్ని దేవతలకు సేనాధిపతిని చేసి తారకాసుర సంహారానికి పంపిస్తుంది పార్వతీ దేవి. తల్లి పిల్లల క్షేమం చూస్తుంది కాబట్టి యుధ్దం జరిగిన ఐదవరోజు స్కంధమాత గా తను కూడా యుద్ధానికి వెళ్ళి రాక్షస సంహారం చేస్తుంది. ఆ విధంగా అమ్మవారు స్కంధమాతగా అవతారం వచ్చింది.

కొత్తది పాతది