నవరాత్రులలో నాల్గవరోజు కూష్మాండదేవి అవతారం


సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ

దధాన హస్త పద్మాభ్యా కూష్మాండా శుభదాస్తు మే

నవరాత్రులలో అమ్మవారి నాల్గవ అవతారం కూష్మాంఢ. ఆశ్వీయుజ శుద్ధ చతుర్థి రోజున దుర్గాదేవిని కూష్మాండ రూపంలో ఆరాధించి పూజలు చేస్తారు. కు అంటే చిన్న, ఊష్మ అంటే శక్తి, అండా అంటే విశ్వం. విశ్వం ఆవిర్భావం అవకముందు అంతా గాఢాందకారం లో ఉంటుంది. అప్పుడు అమ్మవారు తన తేజో శక్తితో విశ్వాన్ని సృష్టించింది కాబట్టి కూష్మాండ గా పేరు వచ్చింది. తన తేజస్సుతో సూర్యున్ని సృష్ణంచి విశ్వానికి ప్రకాశవంతమైన వెలుగును ప్రసాదించినది అమ్మవారు. ఆ విధంగా అమ్మవారి తేజస్సు విశ్వంలో అన్ని చోట్లా ప్రకాశిస్తుంది. కూష్మాంఢ అమ్మవారికి ఎనిమిది చేతులు ఉంటాయి. అందుకే ఈ అమ్మవారి అవతారాన్ని అష్టభుజి అని కూడా అంటారు. చక్రం, గద, అక్షమాల, అమృతకలశం, కమండలం, బాణం, ధనస్సు, కమలం పట్టుకుని, పులి వాహనం పై కూర్చొని ఉంటుంది.  ఒకనాడు సుకేషుని కుమారులైన మాలి, సుమాలి అనే రాక్షసులు శివుని కోసం ఘోర తపస్సు చేస్తుంటారు. ఆ తపస్సు చేస్తున్నప్పుడు వస్తున్న తేజస్సు కు సూర్యునికి ఆశ్చర్యం వేస్తుంది. ఏమిటా తేజస్సు అని చూడటానికి అని తన సూర్యమండలాన్ని వదిలి వాళ్ళు తపస్సు చేసుకునే దగ్గరకి వస్తుంటాడు. సూర్యుడు  వాళ్ళ దగ్గరికి వస్తున్నప్పుడు సూర్యుని వేడికి మాలి, సుమాలి ఇద్దరూ కాలి భూడిద అయిపోతారు. సూర్యమండలాన్ని వెళ్ళిపోయి తను చేయవలసిన కర్తవ్యాన్ని వదిలి వెళ్ళాడనే కోపంతో పరమశివుడు తన త్రిశూలం సూర్యుని పైకి విసురుతాడు. ఆ త్రిశూల ధాటికి సూర్యుడు క్రింద పడిపోతాడు. సూర్యుడు లేని కారణంగా లోకం అంతా అంధకారం అయిపోతుంది. గురుత్వాకర్షణ శక్తి పోయి సూర్యమండలంలో అసమతుల్యం ఏర్పడింది. సూర్యుని తండ్రి అయిన కస్యప ప్రజాపతి సూర్యుడు పడిపోయాడని తెలుసుకుని శివుడు కూడా తన కొడుకుని చంపుకుంటాడని శాపం పెడతాడు. ఆయన శాపం కారణంగానే వినాయకుడుని చంపి ఏనుగు తల పెట్టవలసివచ్చింది. శివుడు తన కోపం కారణంగా విశ్వం అంతా అంధకారంలోకి వెళ్ళిపోయిందని పార్వతి దగ్గరకు వెళ్ళి అన్ని శక్తులకు మూలం, విశ్వానికి తల్లివి నువ్వే కాబట్టి సూర్యున్ని బ్రతికించమని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి సూర్యుడు పడిపోయిన దగ్గరకు వెళ్ళి తన తేజస్సును, శక్తి ని కలిపి ఒక గోళాకార శరీరాన్ని సృష్టిస్తుంది. అదే ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనిపిస్తున్న సూర్యుడు. పరమశివుడు సుకేషణున్ని, కస్యపున్ని పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి తన పిల్లల కోసం వేడుకోమని చెప్తాడు. కస్యపుడు, అదితి ఇద్దరూ కలిసి పార్వతీదేవి దగ్గరకు వెళ్ళి తన కొడుకు కోసం వేడుకుంటారు. అప్పుడు పార్వతీదేవి రెండు ఖాళీ కుండలను తీసుకువచ్చి అందులో ఒకదానిలో మీఇద్దరి రక్తం నింపమని చెప్తుంది. కస్యపుడు తన శక్తిని ఉపయోగించి తనది అతిది ది రక్తం ఆ కుండలో నింపుతాడు. ఒక కుండ వాళ్ళ రక్తంతో నిండుతుంటే ఇంకొక కుండలో అమృతంతో నిండుతుంది. ఆ అమృతాన్ని పడిపోయిన సూర్యుని నోటిలో వేయమని పార్వతీదేవి చెప్తుంది. ఆ అమృతం వేసాక గొప్ప తేజస్సుతో తిరిగి జన్మిస్తాడు. అలాగే మాలి, సుమాలి తల్లితండ్రులయిన సుకేషణుడు, దేవవతి తన కుమారులను కూడా బ్రతికించమని వేడుకుంటారు. పార్వతీదేవి వారికి ఒక గుడ్డు ను ఇచ్చి కొంతకాలం తరువాత ఆ గుడ్డు లోంచి మీ పిల్లలు జన్మిస్తారని చెప్పి వరం ఇస్తుంది. ఆ విధంగా విశ్వాన్ని తిరిగి కాపాడుతుంది కాబట్టి అమ్మవారికి కూష్మాండ అని పేరు వచ్చింది. సూర్యుడు కూష్మాండదేవి ని తన సూర్యాసనంలో ఉండమని వేడుకుంటాడు. అమ్మవారు సూర్యుని మధ్యలో తను ఉండి సూర్యునికి దిశానిర్థేశం చేస్తుంది. ఈ విధంగా అమ్మవారు కూష్మాండ అవతారం ఎత్తింది.

కొత్తది పాతది