నవరాత్రి రెండవ రోజు బ్రహ్మచారిణీ దేవి



బ్రహ్మచారిణీదేవిః 

దధానా కరపద్మాభ్యాం అక్షమాలా కమండలూ

దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా

 నవరాత్రులలో రెండవరోజు అయిన ఆశ్వీయుజ మాసం శుక్ల పక్ష విదియ నాడు దుర్గాదేవి అమ్మవారిని బ్రహ్మచారిణీ అవతారం లో పూజలు చేస్తారు. తెల్లచీర కట్టుకుని, కుడి చేతిలో జపమాల, కమండలం, ఎడమ చేతిలో కలశం ధరించి ఉంటుంది బ్రహ్మచారిణీ దేవి స్వరూపం. బ్రహ్మచారిణీ దేవి బ్రహ్మచర్యంలో ఉన్న శక్తి స్వరూపం అన్నమాట. అదేంటి అమ్మవారు బ్రహ్మచారిణి గా ఉండడం అంటే పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కామీ మేనకా, హమవంతులు అది జరగటం చాలా కష్టం అని చెప్తారు. అయినా పట్టువిడవకుండా శివుని కోసం 5000 ఏళ్ళు తపస్సు చేసింది. తారకాసురడనే రాక్షసుడు శివుని సంతానం వల్లనే తప్ప ఇంకెవరి వల్ల చనిపోకుండా వరం పొందుతాడు. శివుని భార్య అయిన సతీదేవి దక్షయజ్ఞంలో ఆత్మాహుతి చేసుకన్న తరువాత ఆ బాధతో శివుడు వివాహం చేసుకోడని, ఆయనకు సంతానం కలిగే అవకాశం ఉండదని భావించి ఆ రాక్షసుడు అలా వరం కోరుకున్నాడు. కానీ సతీదేవి పార్వతీదేవి గా జన్నించి, శివుని కోసం తపస్సు చేస్తోందని ముందే తెలిసిన దేవతలు పార్వతీదేవి పై శివునికి ప్రేమ కలిగేలా చేయమని మన్నధుణ్ణి అడుగుతారు. శివుని పై పూలబాణం వేసిన మన్నధుణ్ణి తన మూడవ కన్ను తో కాల్చి బూడిద చేస్తాడు శివుడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శివుడికి తన పై ప్రేమ కలగదని భావించి శివుని లాగే బ్రహ్మచర్యంలో ఉండి తపస్సు చేసుకుంటుంది. అలా బ్రహ్మచారిణీ అవతారం లో ఘోర తపస్సు చేస్తుంది అమ్మవారు. ఆ విధంగా సన్యాసిని అయి తిరుగుతూ, తనకు సేవ చేస్తున్న పార్వతీదేవి పట్ల అనురాగం పెంచుకుంటాడు శివుడు. కానీ సతీదేవి తప్ప ఇంకెవరూ తన భార్య కాలేరని భావించి శివుడు, తన గురించి తానే పార్వతీదేవికి తప్పుగా చెప్తాడు. తాను దొంగ సన్యాసి ని అంటూ తనకు తానే తిట్టుకుంటాడు. కానీ పార్వతీదేవి ఆ మాటలు నమ్మకుండా తన తపస్సు ఇంకా ఎక్కువగా చేస్తుంది. చివరికి శివుని పట్టుదలపై పార్వతీ ప్రేమ గెలవడంతో ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు. ఇలా అమ్మవారు బ్రహ్మచర్యంత్వతో ఘోరతపస్సు చేసింది కాబట్టి బ్రహ్మచారిణీదేవి గా పూజలు అందుకుంటుంది. అంటే బ్రహ్మచర్యత్వంతో భగవంతున్ని ప్రార్థిస్తే ఆ భగవంతుడే తనను తాను అర్పించుకుంటాడు అని బ్రహ్మచారిణీ దేవి మనకు నిరూపించింది. ఇది నవరాత్రులలో రెండవరోజు బ్రహ్మచారిణీ దేవి అవతార విశేషాలు.

కొత్తది పాతది