రాముడు దేవుడా?


    ఎన్ని తరాలు మారినా, ఎన్ని యూగాలు మారినా కూడా రామాయణం, రామకథ చిరస్థాయిగా మిగిలిపోతుంది. అసలు ఎందుకు ఇంతగా ఒక మానవున్ని దేవునిగా నిలబెట్టారు. విష్ణువు అవతారాల్లో రాముడు అవతారం ఒకటి కాబట్టి దేవున్ని చేయలేదు. అలా అనుకుని రామాయణాన్ని రామకథను చూస్తే మనుషులమైన మనకి ఎటువంటి ఉపయోగం ఉండదు. దేవుడు కాబట్టి అలా చేయగలిగాడు మనకెంటి అని మనకు అనిపిస్తుంది.రాముడు మానవుడే, మానవులు చేయవలసిన కార్యాలు ధర్మబద్ధంగా చేయాలి అని నేర్పించాడు. రాముడు అందరిలాగే 9 నెలలు తల్లి గర్భంలో ఉండి జన్మించాడు. మనిషి ధర్మంగా ఉండి ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుతూ జీవిస్తే ఆ మానవుడే దేవుడవుతాడు అని నిరూపించిన రాముని కథ కేవలం కథ కాదు. కొన్ని ఏళ్ళ క్రితం జరిగిన ఒక మనిషి చరిత్ర. ఎల్లప్పుడూ సత్య, ధర్మములను ఆచరించి చూపించాడు కాబట్టే రామున్ని ఇన్ని తరాలు మారినా కూడా దేవునిగా నిలబెట్టింది. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఏర్పడినా కూడా మనిషి తను ఆచరించవలసిన ధర్మాలు ఆచరించుకుంటూ ఉంటే ఆ ధర్మమే కాపాడుతుంది. ధర్మో రక్షతి రక్షితః. రాముడు చిన్నప్పుడు తల్లిదండ్రులతో సంతోషంగా గడిపాడు. తన తమ్ముళ్ళతో ఆడుకున్నాడు. విధ్యాభ్యాసం చేసి తన గురువులను గౌరవించాడు. వాళ్ళు చెప్పిన పని చేసేవాడు. వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలను కన్నాడు. అడవికి వెళ్ళి పడవలసిన కష్టాలు అన్ని పడ్డాడు. సీతను అపహరించినప్పుడు రాముడు అడవిలో ఉన్న పక్షులను, చెట్టును, పుట్టను సీత ఏదని అడిగి ఏడ్చాడు. ఎవరు చెప్పడం లేదని గుండెలు బాధుకుని ఏడుస్తాడు. రాజుగా రాజ్యపాలన చేయవలసిన వాడిని అడవులకు వచ్చి కష్టాలు పడుతున్నాను. తండ్రి చనిపోయాడు. ఇప్పుడు సీత లేదు నేను ఎవరికోసం బతకాలి ఇక్కడే నేను చచ్చిపోతాను అని ఏడుస్తాడు. లక్ష్మణుడు నచ్చచెప్తే ఊరుకుంటాడు. ఇలా బాధ, కష్టం, సుఖం, ధుఃఖం, నవ్వు, ఏడుపు ఇవన్నీ మనిషికే ఉంటాయి. ఆయనకి ఉన్న సత్యము, ధర్మము ద్వారానే సాధారణ మానవుడైన రాముడు దేవుడయ్యాడు. మానవుడు సత్య, ధర్మములను ఆచరించి చూపించగలడు. అలా చేస్తే లోకం మొత్తం ఆయన ఆధీనం అవుతుంది అని చేసి, చూపించిన మనిషి రాముడు.


కొత్తది పాతది