Who is the father of Botany??

 

పరాశర మహర్షి

Who is the father of Botany అని  చూడగానే Theopastrus అని చూపిస్తుంది. ఆయన మొక్కల గురించి చాలా పుస్తకాలు రాసారని, ఎన్నో పరిశోధనలు చేసి చాలా విషయాలు చెప్పారని అనుకుంటాం. ఈయన క్రీస్తు పూర్వం.371-286 చెందినవాడు. అలాగే క్రీస్తు శకం 1665 లో రాబర్ట్ హుక్ అనే వృక్షశాస్త్రజ్ఞుడు మైక్రోస్కోప్ ద్వారా వృక్ష కణం యొక్క భాగాలను వివరించాడు. క్రీస్తు శకం 1894 లో డిక్సోనా జోలి చెట్లు, వేర్ల ద్వారా ఆహారం తీసుకుంటాయని, వేర్ల ద్వారానే నీటిని తీసుకుంటాయని కనుగొన్నారు. అంతా బాగానే ఉంది. అయితే మన వేదకాలం లోకి వెళ్తే వ్యాసుని తండ్రి అయిన పరాశరుడు, చరకుడు, సుశ్రుతుడు, వరాహమిహురుడు మొదలైన వారు ఎటువంటి ఆధునిక పరికరాలు లేకుండానే చెట్ల గురించి, వాటి శాస్త్రం గురించి చాలా విషయాలు ఆనాడే చెప్పారు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందా.

  • పరాశరమహర్షి తను రచించిన వృక్ష ఆయుర్వేదం అనే గ్రంధం లో చెట్ల యొక్క నిర్మాణం ఎలా ఉంటుందో చెప్పగలిగారు. వృక్ష శరీర ధర్మశాస్త్రం అనే అధ్యాయంలో కిరణ జన్య సంయోగక్రియ’ (Photo Synthasis) అనాడే వివరించారు. చెట్లు తమ ఆహారాన్ని తామే తయారుచేసుకుంటాయి అని గుర్తించారు. చెట్లు వాటి ఆకుల ద్వారా ఆహారాన్ని తయారుచేసుకుని, వేర్ల ద్వారా నీటిని భూమినుండి తీసుకుంటాయని, ఆకుల సహాయంతోనే ఆహారాన్ని జీర్ణం చేసుకుంటాయని ఇలా చేసే దానిని స్యాంధన అని అంటారని తన గ్రంధంలో తెలియచేసారు. చెట్లను రెండు రకాలు గా ఆనాడే విభజించి చెప్పారు. ఏకదళ బీజం’(మోనోకాటిలిడెన్), ద్విదళబీజం’(డైకాటిలిడెన్) అని చెప్పారు.
  • మహాభారతం లో 184 వ అధ్యాయంలో 18వ శ్లోకంలో చెట్లను పదప అనే పదంతో వివరించారు, అంటే వేరు ద్వారా నీరు గ్రహించేది అని అర్థం.
  • వరాహమిహురుడు తను రచించిన బృహత్ సంహిత లో చెట్లకు వచ్చే అతి ముఖ్యమైన నాలుగు రోగాలను గుర్తించారు.
  • చరకుడు తను రచించిన చరక సంహిత లో నాలుగు రకాలుగా చెట్లను వాటి పువ్వులు, పళ్ళను గుర్తిస్తూ విభజించారు.
  • సుశ్రుతుడుసుశ్రుత సంహిత లో మొక్కలను వాటి ఉపయోగాలు ఆధారంగా 10 రకాలుగా విభజించారు.
  • ఉపవినోదిని అనే గ్రంధం హార్టికల్చర్ గురించి, పృధ్వీ నిరాపార్యం అనే గ్రంధం మొక్కలు జీవిస్తాయని, నిద్రపోతాయనీ, మేల్కోంటాయని, స్పందిస్తాయని చెప్పారు. ఇలా ఎందరో చెట్ల గురించి ఏనాడో మనకి తెలియజేసారు.

కొత్తది పాతది