భూమి గోళాకారంగా ఉంది అని ఎవరు కనుగొన్నారు. కెప్లర్ కోపర్నికస్, గెలీలియో వీరు భూమి గుండ్రంగా ఉందని చెప్పారు అని మనం చదువుకున్నాం. వీరు 16, 17 శతాబ్ధానికి చెందినవారు. అయితే అంతకుముందు వరకూ భూమి గుండ్రంగా ఉంది. అని ఎవరికీ తెలియదా??? మన వేదాలను తెలుసుకుంటే,
- ఋగ్వేదం లో “చక్రాణాసః పరీణహం పృథివ్యా” అనే మంత్రం ఉంది. అంటే భూమి యొక్క వృత్తం అంచున ఉన్నవారు అని అర్థం. ఈ ఋగ్వేదం కొన్ని వేలసంవత్సరాల నాటిది. ‘సూర్యసిద్ధాంత’ అనే గ్రంధంలో “మధ్యే సమన్తాదణ్ణస్య భూగోళో వ్యోమ్ని తిష్ఠతి” అంటే బ్రహ్మాండం మధ్యలో భూగోళం ఆకాశంలో ఉన్నది అని అర్ధం.
- ఆర్యభట్టు రచించిన ఆర్యభట్టీయం అనే గ్రంధంలో “భూగోలః సర్వతో వృత్తః” అంటే భూమి గుండ్రంగా అన్ని వైపులా ఉన్నదని. అంతేకాకుండా భూవ్యాసాన్ని చాలా చక్కటి ఉపమానంతో చెప్పారు. దాని ద్వారా భూవ్యాసాన్ని గుర్తించాడు. ఈ ఆర్యభట్టు క్రీ.శ. 476 ప్రాంతం వాడు.3. “ఆర్యభట్టీయం” గ్రంధం 13 వ శతాబ్ధంలో లాటిన్ భాషలో అనువదించబడింది. ప్రపంచ వ్యాప్తంగా తరువాత ఖగోళ పరిశోధనల మీద ఈ శాస్త్రం ప్రభావం చూపించింది. “ఛాదయతి శశీ సూర్యం శశినం మహతీ చ భూచ్ఛాయా” అని చెప్పాడు. అంటే సూర్యున్ని చంద్రుడు కప్పినప్పుడు ఆ నీడ భూమి మీదకు సూర్యగ్రహణం గానూ, చంద్రున్ని భూమి కప్పినప్పుడు చంద్రగ్రహణం గానూ కనిపిస్తుంది అని చెప్పాడు.
- అంతేకాకుండా సూర్య, చంద్ర గ్రహణాల లెక్కలు ఖచ్చితంగా ఆనాడే ఆర్యభట్టు లెక్కలు వేసి చెప్పాడు. భూమి తన కక్ష్యలో తన చుట్టూ తాను తిరగటానికి 23 గంటల 56 నిమిషాల 4.1 సెకన్ల కాలంపడుతుందని అప్పుడే చెప్పాడు.
- వరాహమిహురుడు క్రీ.శ. 505 లో ‘పంచసిద్ధాంతిక’ గ్రంధంలో “పంచ మహాభూతమయస్తారాగణ పంజరే మహీగోళః” అని వివరించాడు. అంటే పంచ భూతాత్మికమైన గుండ్రని భూమి, పంజరంలో వేలాడే ఇనుప బంతిలాగా, ఆకాశంలో తారల మధ్య నిలిచి ఉంది. అని అన్నాడు.
- లీలావతి అడిగిన ప్రశ్నకు భాస్కరాచార్యుడు అనే గణిత శాస్త్రవేత్త “నువ్వు చూసేదంతా నిజం కాదు. భూమి చదరంగా లేదు. గుండ్రంగానే ఉంది” అని తను రచించిన ‘లీలావతి’ అనే గ్రంధంలో ఉంది.
ఈనాటి Geography అంటే భూగోళశాస్త్రం. కాబట్టే భూమిని గురించి చదువుకునే
శాస్త్రానికి భూగోళశాస్త్రం అన్నారు మనవాళ్ళు. గోళం అంటే గుండ్రనిది అని కాదా! కెప్లర్, కోపర్నికస్ కన్నా ముందే మన ఋషులు, పండితులు భూమి గుండ్రంగా ఉందని, ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం(Technology) లేనప్పుడే మన వాళ్ళు అన్ని విషయాలు వివరించారు. ఇది ప్రతి భారతీయునికి ఎప్పటినుండో తెలుసుకదా! ఇప్పటి సాంకేతిక పరిజ్ఞానం మూలం మన భారతీయులే. అది మన
సనాతన ధర్మం. మన భారతీయ గ్రంధాలు, వేదాలను అనుసరించి మేమే చెప్పాం, మేమే
కనిపెట్టాం అని ఎవరెవరో గొప్పలు చెప్పుకోవటం మన భారతీయుల దురదృష్టం.