చిరంజీవి అంటే మరణం లేనివారు అని అర్ధం. అయితే ఏడు గురే మరణం లేకుండా ఉన్నారని చాలామంది అభిప్రాయం కానీ, వాటికి సంబంధించి, ఒక శ్లోకం కూడా ఉంది. అది "అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః , సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం జీవేద్వర్షశ్శతమ్ సొపి సర్వవ్యాధి వివర్జిత". అశ్వత్ధామ, బలి చక్రవర్తి, వ్యాస మహర్షి, ఆంజనేయుడు, విభీషణుడు, కృపాచార్యుడు, పరశురాముడు వీళ్ళు ఏడుగురు వరాల వల్ల ఎప్పటికీ మరణం లేకుండా ఉండే శక్తిని పొందారు. వీళ్ళ తరువాత మార్కండేయ మహర్షి కూడా ఉన్నారు. శ్రీకృష్ణుని శాపం వలన అశ్వత్థామ, వామనమూర్తి వరం వలన బలి చక్రవర్తి, లోకానికి మంచి చెయడాని కోసం వ్యాసుడు, బ్రహ్మవరం వలన ఆంజనేయుడు, శ్రీరాముని వరం వల్ల విభీషణుడు, వింతగా జన్మించడం వల్ల కృపాచార్యుడు, తపఃశక్తి కారణంగా పరశురాముడు, పరమశివుని అనుగ్రహంతో మార్కండేయ మహర్షి. ఈ ఏడుగురుని స్మరించి ఎనిమిదవ వాడైన మార్కండేయ మహర్షిని స్మరిస్తే అన్నిరకాల వ్యాధులు తొలగిపోతాయి అని ఈ శ్లోకార్ధం. ఎప్పటికీ మరణం లేకుండా ఇప్పటికీ కూడా ఎక్కడో జీవించే ఉంటారు. వీళ్లు ఎలా మరణం లేని వరం పొంది చిరంజీవులుగా ఉన్నారో, వాటి కథలు ఆ పరిస్థితులు గురించి మళ్ళీ తెలియచేస్తాను.
- Home
- ద్వాదశ జ్యోతిర్లింగాలు చరిత్ర
- __సౌరాష్ట్ర సోమనాథుడు
- __శ్రీశైలం మల్లిఖార్జున స్వామి
- __ఉజ్జయినీ మహంకాళేశ్వరుడు
- __ఓంకారం అమలేశ్వరుడు
- __బైధ్యనాథుడు
- __ఢాకిన్యాం భీమశంకరుడు
- __రామేశ్వరుడు
- __దారుకావనం నాగేశ్వరుడు
- __వారణాశి విశ్వేశ్వరుడు
- __త్య్రంబకేశ్వరుడు
- __కేధారేశ్వరుడు
- __ఘృష్ణేశ్వరుడు
- అష్టాదశ శక్తిపీఠాలు చరిత్ర
- __లంకాయాం శాంకరీదేవి
- __కంచి కామాక్షిదేవి
- __ప్రద్యుమ్నం శృంఖలాదేవి
- __క్రౌంచపట్టణం ఛాముండేశ్వరీదేవి
- __అలంపురీ జోగులాంబదేవి
- __శ్రీశైలం భ్రమరాంబికాదేవి
- __కౌల్హాపురీ మహాలక్ష్మిదేవి
- __మహూర్యే ఏకవీరికా దేవి
- About