అశ్వత్థామ

 

Aswatthama
కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ
అశ్వత్థామ మహాభారతంలో కురుకుల గురువైన ద్రోణాచార్యునికీ, కృపికి పుట్టిన కుమారుడు. అశ్వత్థామ పుట్టినప్పుడు తన నుదుటిపైన ఒక రత్నంతో పుడతాడు. అశ్వత్థామ కురుక్షేత్ర యుద్ధంలో చాలా ప్రాధాన్యత వహించాడు. అశ్వత్థామ చనిపోయాడు అనుకుని ద్రోణుడు తన  ఆయుధాలను వదిలేస్తే దుష్టద్యుమ్నుడు ద్రోణున్ని చంపేస్తాడు. అప్పుడు అశ్వత్థామ కోపంతో పాండవులను చంపడానికి రాాత్రికి పాండవుల గుడారానికి వెళ్ళినప్పుడు పాండవులు అక్కడ లేకపోవడం తెలుసుకుని పాండవులు కుమారులను చంపేస్తాడు. అర్జునుడు అశ్వత్థామ మీదకి బ్రహ్మాస్త్రం వేసాడని తెలుసుకుని, అశ్వత్థామ కూడా బ్రహ్మాస్త్రం ప్రయోగం చేస్తాడు. రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే ప్రళయం వస్తుందని, వాటిని ఉపసంహరించుకోవాలని ఋషులు చెప్తే అర్జునుడు ఉపసంహరిస్తాడు. కానీ అశ్వత్థామ ఉపసంహరించలేకపోతాడు, దానిని పాండవుల కోడళ్ళ కడుపులో ఉన్న సంతతిని చంపమని ఆదేశిస్తాడు. దానికి అర్జునుని కోడలు, అభిమన్యుని భార్య అయిన ఉత్తరా కడుపులో ఉన్న శిశువును చంపేస్తే, శ్రీకృష్ణుడు ఉత్తరా గర్భంలోకి వెళ్ళి ఆ శిశువును కాపాడతాడు. కడుపులో ఉన్న శిశువును కూడా చంపడానికి ప్రయత్నించినందుకు  శ్రీకృష్ణుడు అశ్వత్థామను మూడు వేల సంవత్సరాలు కుష్టు వ్యాధికి గురవమని తన నుదుటిపైన ఉన్న రత్నాన్ని వదులుకునేలా చేసి ఒక గాయం ఏర్పరచి చావులేకుండా ఉండమని శపిస్తాడు. అయితే అశ్వత్థామ ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడని ఆధారాలు కూడా ఉన్నాయి.  గుజరాత్ లో ఉన్న శూల్పనేశ్వర్ అనే అడవులలో ఇప్పటికీ అశ్వత్థామ ఉన్నాడనీ కొంతమంది అతనిని చూసారని చెప్పడం జరిగింది. Indian Air Force లో పనిచేసిన ఫైలట్ బాబా అనే ఫైటర్ ఫైలట్ హిమలయాల్లో ఒక తెగ మధ్యలో ఉండడం తను చూసానని అక్కడ ఉన్న శివుని ఆలయంలో ప్రార్థనలు చేస్తుంటాడని చెప్పారు.

కొత్తది పాతది