బలిచక్రవర్తి

bali chakravathi
బలి చక్రవర్తి 
మరణం లేకుండా వరం పొందినవాళ్ళలో బలిచక్రవర్తి  కూడా ఉన్నారు. బలిచక్రవర్తి తండ్రి విరోచనుడు, తల్లి దేవాంబ. ఇతడు విష్ణు భక్తుడైన ప్రహ్లాదుని మనుమడు. బలిచక్రవర్తి దేవతలకు, రాక్షసులకు జరిగిన యుద్ధంలో ఇంద్రున్ని జయించి స్వర్గానికి రాజు అయ్యాడు. ఆ తరువాత ఇంద్రుడు విష్ణుమూర్తికి వేడుకుంటే విష్ణువు వామనుడి అవతారంలో వెళ్ళి బలిచక్రవర్తి అశ్వమేధ యాగం లో తను "మూడు అడుగుల నేల కావాలి" అంటే వామనుడు ఒక్క అడుగులో భూమిని, రెండవ అడుగులో ఆకాశాన్ని కొలిచి, మూడవ అడుగు ఎక్కడు పెట్టాలని అడిగినప్పుడు, బలిచక్రవర్తి తన తలపై పెట్టమని చెప్తాడు. వామనుడు, బలిచక్రవర్తి తలపై అడుగుపెట్టి పాతాళంలోకి తోసేస్తాడు. అలా తనను తానే దానంగా ఇచ్చిన బలిచక్రవర్తికి వామనమూర్తి సూర్యసావర్ణిక మన్వంతరం లో స్వర్గంలో ఇంద్రునిగా ఉంటావని వరం ఇస్తాడు. అంతే కాకుండా మరణం లేని వరాన్ని ఇస్తాడు. బలిచక్రవర్తి హిందూ పురాణాలలోనే కాకుండా జైనమతంలోనూ, బౌద్ధమతంలో కూడా ఉంటుంది. కేరళలో జరిగే "ఓణం" పండుగకు బలిచక్రవర్తి అక్కడ ఉన్న వాళ్ళ అందరి ఇంటికీ వచ్చి ఆతిథ్యం తీసుకుని వెళ్తాడు అని అక్కడి వాళ్ళందరి నమ్మకం. దీనినే "బలిపాడ్యమి" అంటారు. దీపావళి కి నాలుగురోజులకు వచ్చే పాడ్యమి రోజు విష్ణుమూర్తి అనుమతి ప్రకారం ఆరోజు భూమిమీదకు వచ్చి వెళ్తాడు అని పురాణాలలో ఉంటుంది. బలిచక్రవర్తి గురించి రామాయణం, భాగవతం లోనే కాకుండా బ్రహ్మపురాణం, కూర్మపురాణం, మత్స్యపురాణంలో కూడా ఉంటుంది. మహారాష్ట్ర, గుజరాతే, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఈ బలి పాడ్యమి చేస్తారు. రాక్షస రాజైనా కూడా బలిచక్రవర్తి ఒక మంచి రాజు గా బలిచక్రవర్తికి మంచి పేరు ఉంది.

కొత్తది పాతది