పరశురాముడు |
వాటినే "పరశురామక్షేత్రాలు" అంటారు. పరశురాముడు సమస్త అస్త్రవిద్యలన్నీ సాక్షాత్తూ ఆ పరమశివున్నే మెప్పించి ఆయన దగ్గరే నేర్చుకున్నారు. ఆ తపో శక్తికి పరమశివుడు చిరంజీవిగా ఉండాలని వరం ఇస్తారు. త్రేతాయుగంలో రాముని వివాహం దగ్గరకు వచ్చి శివధనుస్సును విరిచినందుకు ఆగ్రహించి, తన దగ్గర ఉన్న విష్ణుచాపాన్ని కూడా ఎక్కుపెట్టమని రామున్ని ఆజ్ఞాపిస్తాడు. తరువాత ద్వాపరయుగంలో ఆయన భీష్మునికీ, కురు కుల గురువు అయిన ద్రోణాచార్యునికీ, కర్ణుడికీ కూడా తన దగ్గర ఉన్న అస్త్ర విద్యలన్నీ వారికి చెప్పారు. అంతేకాకుండా కలియుగంలో కల్కకి కూడా ఆయనే గురువుగా విద్యలన్నీ చెప్తారని పురాణంలో ఉంటుంది. ఇప్పటికీ మహేంద్రగిరి దగ్గర ఒక బ్రాహ్మణునిగా జీవితం గడుపుతూ కల్కి భగవానుని కోసం వేచి చూస్తూ ఉంటారు. వైశాఖ మాసం శుక్లపక్షమ తృతీయ నాడు పరశురామ జయంతిగా వ్యవహరిస్తారు. పరశురామున్నే భార్గవరాముడు, జామదగ్ని అని కూడా అంటారు. పరశురాముని తండ్రి జమదగ్ని మహర్షి, తల్లి రేణుకాదేవి. విష్ణుమూర్తి ఆరవ అవతారం పరశురాముడు.