బాదరాయణుడు గా పేరు ఉన్న వ్యాస మహర్షి ఉత్తరాఖండ్ లో ఉన్న బదరికాశ్రమం లో ఇప్పటికీ ఉన్నాడు. అక్కడ వ్యాస గుహ ఉంది. వేదాలు, బ్రహ్మసూత్రాలు, అష్టాదశపురాణాలు, ఉపనిషత్తులు రచించారు. శ్రీమథ్భాగవతాన్ని సరస్వతీ నదికి పశ్చిమతీరంలో ఒక ప్రాంతంలో రచించినట్టు భాగవతంలో చెప్పారు. బదరికాశ్రమంలో అలకనందా నది, సరస్వతీ నదిలో కలుస్తుంది. అక్కడ సరస్వతీ నదికి పడమర దిక్కున ఒక చిన్న పర్వతం ఉంటుంది.
అక్కడే ఆయన రచించారు. అంతేకాకుండా కాశీలో కూడా ఉండి వెళుతుంటారని కూడా ఆధారాలున్నాయి. పార్వతీదేవి శాపం వల్ల కాశీలో అడుగు పెట్టకుండా అక్కడికి దగ్గరలో ఆశ్రమం ఏర్పరచుకుని ఆ కాశీవిశ్వేశ్వరున్ని కొలుస్తుంటారని అంటారు. దానినే వ్యాసకాశీగా పేరు ఉంది. దాని గురించి ఈ blog లో వివరించడం జరిగింది. చదవగలరు. వ్యాస మహర్షి ని ఆదిశంకరులు, రామానుజాచార్యులు, మద్వాచార్యులు కూడా కలిసి బ్రహ్మసూత్రాలకు భాష్యం తెలుసుకుని, రచించారు అని ఆధాారాలున్నాయి. అయితే బదరికాశ్రమం (బధ్రినాథ్) వెళ్ళిన వారికి ఎందుకు కనిపించలేదు వ్యాసమహర్షి అంటే సాధారణ మానవులు వారిని చూడలేరు. వైరాగ్యం కలిగి భగవంతుని చేరాలని కోరుకున్న వాళ్ళకి వ్యాసమహర్షి దర్శనం తప్పకుండా కలుగుతుంది.