హిందుమతం మతంకాదు

హిందు అనేది ఒక మతం కాదు. అది "సనాతన ధర్మం". ఎంత పాతది అయిన ఎప్పటికీ కొత్తగా అన్ని విషయాలను తెలుసుకునే విధంగా ఉంటుంది. వేదాలు, పురాణాలు, రామయణ, మహాభారత, భాగవతం, ఉపనిషత్తులు ఇన్ని ఉన్నా ఎందులోను హిందుమతం అని ఎక్కడ ప్రస్తావన ఉండదు. ఇంతకు ముందు పార్శీలు దండయాత్ర చేసినప్పుడు సింధు నది నుండి చుట్టుపక్కల ఉన్నవారిని సిందువులు అని కాలక్రమంలో అది హిందువులుగా మారింది తప్ప అసలు హిందు అనేది మన శాస్త్రంలో లేదు. అయితే మనది సనాతన ధర్మం. ఏ దేవున్ని పూజించాలి అంటే "అజాయమానో బహుధా విజాయతే", "ఏకమేవా అధ్వితీయం బ్రహ్మ" ఎన్నో ఉన్నట్టు కనిపించే ఒక్కడే పరబ్రహ్మ. బ్రహ్మము అంటే ఎటువంటి ఆకారము లేకుండా అన్నింటిలోను, అన్నిటిగా కనిపించేది. మన మనసుకు నచ్చిన దేవున్ని పూజించుకోవచ్చు. భాగవతంలో "మూడు మూర్తులకును మూడు కాలములకు మూడు లోకములకు మూలమగుచు బేధముగుచు తదకబేధమై ఒప్పారు బ్రహ్మమనగ నీవే ఫాలనయనా" అని పోతన గారు పద్యం ఉంది. అంటే ముగ్గురు దేవుళ్ళలా, మూడు కాలాలుగా, మూడు లోకాలుగా ఉన్నట్టుగా కనిపించినా అన్నింటిలో ఉండే పరబ్రహ్మ నీవే కదా స్వామి అని. సరే అయితే అసలు ఎలా పూజించాలి. మన శాస్త్రంలో "శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేధనం" అని తొమ్మిది రకాలుగా భగవతారాధన చెయ్యొచ్చు. 

శ్రవణం - భగవంతుని గురించి వినటం

కీర్తనం - భగవంతుని పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడటం అవి రాకపోయినా మనస్ఫుర్తిగా ఆ                           భగవంతుని నామాన్ని పలికినా చాలు.

స్మరణం - భగవంతున్ని తలుచుకోవటం

పాదసేవనం - భగవంతుని పాదసేవ చేయటం

అర్చనం - అర్చన, పూజ చేయటం

వందనం - నమస్కరించటం

దాస్యం - గుడి వాటి ఆవరణలు శుభ్రం చేయటం

సఖ్యం - భగవంతునితో స్నేహం చేయటం

ఆత్మనివేధనం - మన మనస్సును భగవంతునికి అర్పించటం

వీటన్నిటిలో మనకు ఏవిధంగా అయినా దేవుని  దగ్గరకు చేరుస్తుంది. దేవున్నే మన దగ్గరకి వచ్చే విధంగా చేస్తుంది. మనకి ఉన్నంతలో ఎలా చేసినా దేవుడు తీసుకుంటాడు. అంతేకానీ ఎక్కువ ఖర్చులు పెట్టి చేస్తేనే పూజ అనిపించుకోదు. "తులసీదళ మాత్రేన జలస్య చులుకేన చ విక్రీణీతే స్వం ఆత్మానం భక్తేభ్యో భక్త వత్సలః" అని భగవంతుడే అంటాడు. అంటే ఒక తలసి ఆకు, అరచేతిలో పట్టినన్ని నీళ్ళు నాకు మనస్ఫూర్తిగా నాకు అర్పిస్తే నేను, నా ఆత్మ ఆ భక్తునికి లొంగిపోయి ఉంటాను అని ఆ దేవుడే సాక్షాత్తు చెప్తాడు. అయితే భగవంతున్ని పూజిస్తే మనకు కష్టాలను తీర్చి మన కోరికలు తీరుస్తాడా? కష్టాలు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. నువ్వు కోరుకున్న కోరిక ధర్మబద్థంగా ఉంటే స్వయంగా ఆ దేవుడే నీదగ్గరకి వచ్చి ఇస్తాడు. కనుక హిందూ అనేది ఒక మతం గా కాకుండా మన ధర్మంగా తీసుకుని, మూడనమ్మకాలకు పోకుండా భగవంతున్ని చేరే సాధనంగా తీసుకుని అందరూ సుఖశాంతులతో, ఆనందంగా జీవితాలు కొనసాగాలి. సర్వేజనా సుఖినోభవంతు.

కొత్తది పాతది