108 సంఖ్య ప్రాముఖ్యత

    
 

ఈ 108 అనే సంఖ్య మనకి ఎప్పుడూ వినబడుతూనే ఉంటుంది. జపమాలలో 108 పూసలు, 108 ఉపనిషత్తులు, దేవున్నిపూజించినప్పుడు 108 నామాలు. అసలు ఏంటి ఈ 108 సంఖ్యకు ఉన్న ప్రాధన్యత. ఈ 108 నెంబరు భారతదేశంలో ఉండే హిందువులే కాదు. భౌద్దులు, జైనులు, సిక్కులు వారందరూ గుర్తించారు. దైవత్వాన్ని గ్రహించడానికి ఆత్మ 108 మెట్లు దాటాలని వారి నమ్మకం. ఈ 108 నెంబరు భగవంతునికి, భక్తునికి వారధి గా ఉంటుందని భారతీయుల నమ్మకం.

  • వేదంలో ఋషులు కూడా ఖగోళశాస్త్రానికి సంబందించి భూమికి, చంద్రునికి మధ్య దూరం, చంద్రుని వ్యాసానికి 108 రెట్లు ఉందని,
  • భూమికి, సూర్యునికి మధ్య దూరం, సూర్యుని వ్యాసానికి 108 రెట్లు ఉందని.
  • సూర్యుని యొక్క వ్యాసం భూమి వ్యాసానికి 108 రెట్లు ఉందని చెప్పారు.
  • వేదంలో చెప్పబడినట్టు ఇప్పుడు సాంకేతిక విశ్వ లెక్కల్లో తెలిసిన భూమికీ, చంద్రునికీ, భూమికీ సూర్యునికీ ఉన్న దూరంతో దాదాపు సరిపోయింది.
  • ఆయుర్వేదంలో కుడా మనిషి శరీరంలో 108 మర్మస్థానాలు ఉన్నాయి అని చెప్తుంది. ఈ మర్మస్ధానాల ద్వారా ప్రాణశక్తి వస్తుంది అని ఆయుర్వేదంలో చెప్పబడింది.
  • శ్రీ చక్రయంత్రంలో 54 స్త్రీ, 54 పురుష అంతర్భాగాలు ఉంటాయి. ఇవి మొత్తం 108.
  • అదేవిధంగా జ్యోతిష్యశాస్త్రంలో 27 నక్షత్రాలకు 4ఏసి పాదాల చొప్పున మొత్తం 108 పాదాలు.
  • అలాగే 12 రాశులు, 9 గ్రహాలు 12x9=108.
  • భరతుడు తన నాట్యశాస్త్రం లో చేతులు, కాళ్ళు కలిపి చేసే నాట్యభంగిమలలో మొత్తం 108 గా గుర్తించాడు. వీటిని కరణములు అంటారు.
  • చాలామంది సిద్ధులు వారి పేర్ల ముందు 108 గానీ, 1008 గానీ ఉంచుకునే సాంప్రదాయం ఉంది.
  • సంస్కృత భాషలో 54 అక్షరాలు ఉంటాయి. వీటికి శివ, శక్తి తత్వాలైన స్త్రీ, పురుషరూపాలు ఉంటాయి. అంటే 54x2=108 అన్నమాట
  • భారతీయ కాలగణన ప్రకారం బ్రహ్మకు ఒకరోజు అంటే 4 యుగాలు కలిపి 43.20.000 సంవత్సరాలు. ఈ సంఖ్య 108 తో భాగించబడుతుంది.
  • సంఖ్యాశాస్త్రంలో 108 ని 1+0+8=9 గా రాస్తారు. మీ అందరీకీ తెలిసే ఉంటుంది 9 తో గుణించి వచ్చిన నెంబరు కూడా 9 వస్తుంది.

ఇంతటి విశిష్టత ఉన్న 108 సంఖ్య ఎంతో ప్రాముఖ్యం ఉంది. అది సృష్టికర్తకు, సృష్టికీ అనుసంధానం కలిగించేది. అందుకే మన ఋషులు, పురాణాలు, వేదాలు, భారతీయ సంస్కృతి 108 నెంబరుకు ఇంతటి పవిత్రత ఇస్తుంది. సో చూసారు కదా 108 నెంబరు యొక్క పవర్, మరో interesting topic తో మళ్ళీ కలుద్దాం అంతవరకూ సెలవు. నమస్కారం.

కొత్తది పాతది