బ్రహ్మపురాణం

     పద్దెనిమిది పురాణాలలో మొట్టమొదటి పురాణం బ్రహ్మపురాణం. బ్రాహ్మం ముర్దా హరేరావ అని మహావిష్ణువు యొక్క శిరస్సుతో పోల్చబడింది బ్రహ్మపురాణం. ఇందులో పూర్వభాగం, ఉత్తరభాగం అని రెండు భాగాలుగా విభజించబడింది. బ్రహ్మదేవుడు, మరీచి మహర్షికి వివరింపబడింది కాబట్టి దీనికి బ్రహ్మపురాణం అవి పేరు వచ్చింది. సగటు మనిషి ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఎలా సాధించగలడో తెలియచేసే అంశాలు ఇందులో ఉంటాయి. సృష్టి ఎలా ఆవిర్భవించింది అన్న అంశంతో మొదలై సూర్యవంశం, చంద్రవంశ రాజుల చరిత్ర వారి వృత్తాంతం. ఇందులో పార్వతీదేవి గురించి పూర్తిగా వివరించబడి ఉంటుంది. ఇందులో తీర్థాలు వాటి ప్రాసస్త్యం శ్రీకృష్ణుని చరిత్ర ఉంటుంది. మనిషి చనిపోయిన తరువాత జీవుడు పొందే అవస్థల గురించి కూడా ఉంటుంది. మహాప్రళయం ఎలా వస్తుంది. ఆ ప్రళయంలో జరిగే సంఘటనలు వివరింపబడి ఉంటాయి. పూరీజగన్నాథ క్షేత్రం గురించి, నరసింహస్వామి పూజావిధానం, పవిత్ర నదుల గురించిన వృత్తాంతాలు ఇందులో ఉంటాయి. ధధీచి, ఆత్రేయ, మార్కండేయ మొదలగు మహర్షుల గురించి ఉంటాయి. కరాళజనకుడు అనే రాజు వశిష్ట మహర్షిని ప్రశ్నంచడం వలన సమస్త సాంఖ్యయోగ సిద్దాంతాలు ఇందులో వివరించబడ్డాయి. సమస్త భూమండలంలో భారతదేశం శ్రేష్ఠమైనదనీ, అందులో దండకారణ్యం పుణ్యప్రదాయక ప్రదేశమని అంటుంది బ్రహ్మపురాణం. ప్రస్తుత ఒరిస్సా రాష్ట్రంలో ఉన్న కోణార్క దేవాలయం గురించి, సూర్య ఆరాధన, సూర్యుని మహిమ ఆయన ప్రసరించే శక్తిని గూర్చి ఇందులో వ్యాస మహర్షి వివరించారు. భారతదేశంలో ప్రవహించే నదుల్లో గంగా, గోదావరి నదులు ప్రముఖమైనవనీ, ఈ ప్రాంతంలో ఆచరించే ఆచార, వ్యవహారాలు, శుభకర్మలు, భక్తి, ముక్తి కలిగించగలవనీ ఈ పురాణంలో తెలియచేయబడింది. 




కొత్తది పాతది