తల్లి కడుపులో ఉన్నప్పుడే వేదాలను చెప్పిన అష్టావక్రుడు

         ఏకపాదుని కుమారుడైన అష్టావక్రుడు తల్లి గర్భంలో ఉండగా తండ్రి చదివే శ్లోకపఠనంలో తప్పులు ఉన్నాయని చెప్పాడు. తండ్రి కోపించి అతన్ని 8 వంకరలతో పుడతావని శపించాడు. అలా తండ్రి శాపంతో వికృతరూపంతో జన్మించాడు. అష్టావక్రుడు పుట్టుకతోనే మహా పండితుడు. అష్టావక్రుడు పుట్టకముందే తన తండ్రి జనకుని ఆస్థానంలో జరిగిన పాండిత్య పోటీలో ఓడిపోయి పోటీ నిబంధనల ప్రకారం దగ్గరలోని నదిలో పడి మరణించాడు. అష్టావక్రుడు జన్మించిన తరువాత ఈ విషయాన్ని తెలుసుకొని బాల్యంలోనే జనకమహారాజు ఆస్థానానికి వెళ్ళి తన తండ్రిని ఓడించిన పండితునితోనే పోటీచేసి ఓడించాడు. నిబంధనల ప్రకారం ఆ పండితుడు ఓడిపోయి నదిలో పడి మరణించగానే అష్టావక్రుని తండ్రి బ్రతికివచ్చాడు. తన పాండిత్యాన్ని చూసిన జనకమహారాజు అష్టావక్రుని దగ్గర అధ్వైతబోధనలను నేర్చుకున్నాడు.

జనకునికి చెప్పిన బోధలే అష్టావక్రగీత గా చరిత్రకెక్కింది. అష్టావక్రుడు వదాన్యముని కుమార్తెను వివాహాం చేసుకోవాలనుకొని అతనిని అడగ్గా ఉత్తరదిక్కుగా ప్రయాణించి శివపార్వతులను ప్రార్థించి ఆ తర్వాత అక్కడ ఉన్న అందమైన కన్యతో మాట్లాడి తిరిగివస్తే అప్పుడు తన కుమార్తెను ఇచ్చి పెళ్ళి చేస్తానని వదాన్యముని అంటారు. అష్టావక్రుడు అలాగే ఉత్తర దిక్కుకి వెళ్ళి శివపార్వతులను పూజించి ఆ తర్వాత మరింత ముందుకు వెళ్ళి 7 అందగత్తెలను చూసి అందులో పెద్దదైన ఉత్తరతో మాట్లాడతాడు. ఆమె అతన్ని వివాహం చేసుకొమ్మంటే అష్టావక్రుడు దానికి ఒప్పుకోడు. తిరిగి వచ్చి జరిగింది చెప్పి వదాన్యముని కుమార్తెను వివాహం చేసుకుని ఆనందంగా గడుపుతాడు.

కొత్తది పాతది