వింధ్యపర్వతం

         పర్వతాలలోకెల్ల గొప్పది వింధ్యపర్వతం. వింధ్యుడు పెద్దలను, దేవతలను, అమ్మవారిని ఎప్పుడూ గౌరవించేవాడు. ఒకసారి నారదుడు వచ్చి వింధ్యా ప్రతి పర్వతాలనికి ఒక గొప్పతనం ఉంది. హిమవంతుడు పార్వతికి తండ్రి, శివునికి మామ.కైలాసం శివునికి నివాస స్థానం. నిషద, నీల, గంధమాదన పర్వతాలు వాటి ప్రత్యేకతలు వాటికి ఉన్నాయి. మేరుపర్వతం చుట్టూ సూర్యుడు గ్రహాలతో సహా ప్రదక్షిణలు చేస్తున్నాడు. అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ మాట విన్న వింధ్య పర్వతానికి కోపం వచ్చింది. మేరుపర్వతాన్ని జయించి, తన సామర్ధ్యం చూపించాలి అనుకుని తన ఆకారాన్ని పెంచి ఆకాశానికి ఎదిగాడు. ఆకాశాన్ని తన్ని పెట్టుకునిలబడి ఉండిపోయాడు. ఇంతలో సూర్యుడి రధం అక్కడికి వచ్చింది. ముందుకు వెళ్ళడానికి దారిలేదు. సూర్యుడు ఆగిపోయాడు. జగత్తు అంతా స్తంభించిపోయింది. సంధ్యావందన, హోమాది కార్యక్రమాలు ఆగిపోయాయి. దేవతలు, మునులు వెళ్ళి శివుడిని పూజించారు. శివుడు వచ్చి దేవతలను విష్ణువు దగ్గరకి తీసుకుని వెళ్ళారు. విష్ణువు నేను ఏమి చేయలేను అని అగస్త్య మహర్షి దగ్గరికి వెళ్ళమని చెప్పారు. అగస్త్య మహర్షి కాశీక్షేత్రంలో తపస్సు చేసుకుంటున్నారు. సముద్రాలను ఆపోశనం పట్టినవాడు, వాతాపి అనే రాక్షసుడిని జీర్ణం చేసుకున్నవాడు అయిన మిత్రావరుణ నందనుడు భార్య లోపాముద్రతో కలిసి దక్షిణానికి పయనమయ్యాడు. 

          ఆగస్త్య మహర్షి రాకను దూరం నుంచి చూసిన వింధ్యపర్వతం వినయంగా భక్తితో సాష్టాంగ నమస్కారంచేసాడు. అగస్త్యమహర్షి నాయనా వింధ్య నేను దక్షిణానికి వెళుతున్నాను. తిరిగి వచ్చేవరకు ఇలాగే ఉండు. అని శ్రీశైలం దర్శంచి మలయ పర్వతం పై అగస్త్యమహర్షి ఉండిపోయారు. వింధ్యపర్వతం పెద్దలకు సాష్టాంగ నమస్కారం చేస్తూ అలాగే ఉండిపోయాడు. వింధ్య పర్వతం వినయానికి మెచ్చి అమ్మవారు వింధ్యపర్వతం మీద విడిది చేసింది. వింధ్యపర్వతం మీద ఉంటుంది కాబట్టి అమ్మవారికి వింధ్యవాసిని అనే నామం వచ్చింది. 

కొత్తది పాతది