రుద్రాక్ష ఎలా వచ్చింది

         దేవీభాగవతంలో ఉన్న రుద్రాక్ష ఎలా వచ్చింది. అది ఎలా ధరించాలి. అనే విషయాలు ఈ ఆఖ్యానంలో తెలుసుకుందాం. 

          ్రతిపురాసుర సంహారానికి ముందు శివుడు తపస్సు చేసాడు. అతని మూడు కళ్ళనుండి మూడు భాష్పజల బిందువులు పడ్డాయి. సూర్యనేత్రం నుండి 12 కపిలరంగు తో, సోమనేత్రం నుండి 16 తెల్లని రంగుతో, వహ్నినేత్రం నుండి 10 నల్ల రంగుతో 38 రకాల రుద్రాక్ష చెట్లు పుట్టాయి. తరువాత వాటినుండి అన్ని రకాల రంగులు గల రుద్రాక్షలు పుట్టాయి. 

    ఏకముఖి రుద్రాక్ష                    శంకరుడు

    ద్విముఖి రుద్రాక్ష                    పార్వతీపరమేశ్వరుడు

    త్రిముఖి రుద్రాక్ష                    అగ్ని

    చతుర్ముఖి రుద్రాక్ష                బ్రహ్మ

    పంచముఖి రుద్రాక్ష                కాలాగ్ని

    షణ్ముఖి రుద్రాక్ష                    కుమారస్వామి

    సప్తముఖి రుద్రాక్ష                   మన్మధుడు

    అష్టముఖి రుద్రాక్ష                    వినాయకుడు

    నవముఖి రుద్రాక్ష                    కాలభైరవుడు

    దశముఖి    రుద్రాక్ష                    జనార్ధనుడు

    ఏకాదశముఖి రుద్రాక్ష                ఏకాదశ రుద్రులు

    ద్వాదశమఖి రుద్రాక్ష                 ద్వాదశాదిత్యులు

    పదమూడుముఖాల రుద్రాక్ష    కారికేయుడు

     పద్నాలుగు ముఖాల రుద్రాక్ష   శివుడు

 ఇలా ఒక్కొక్క ముఖం గలిగిన రుద్రాక్షకు ఆ దేవత ఆవాహనం అయి ఉంటారు. అష్టోత్తర శతరుద్రాక్ష మాల జపం చేయడానికి మంచిది. బంగారంతో గాని, వెండితో గాని తీగచుట్టి రుద్రాక్షను శిరస్సున కాని, మెడలో కాని, చెవికి కాని ధరించవచ్చు. యజ్ఞోపవీతానికి కూడా ధరించుకోవచ్చు. చేతులకు కట్టుకోవచ్చు. ఎక్కడ ధరించినా భక్తితో ధరించాలి. మెడలో 32 రుద్రాక్షలు, తలమీద పెట్టుకుంటే 40, రెండు చెవులకు  6 చొప్పును, రెండు చేతులకు 10 చొప్పున, రెండు భుజాలకు 16 చొప్పున, కంటికి ఒకటి చొప్పున, శిఖమీద 1, వక్షస్థలాన 8 ధరించాలి. అలాగ రుద్రుడు ధరిస్తారు. అలా ధరించిన మానవుడు సాక్షాత్తూ రుద్రుడు అవుతాడు. శిఖమీద ధరించేటప్పుడు పరమేశ్వరుడిని, చెవులకు పెట్టుకునేటప్పుడు శివపార్వతులను, చేతులకు కట్టుకనేటప్పుడు అన్ని దిక్కులను, మెడలో వేసుకునేటప్పుడు సరస్వతిని, అగ్నిని తలుచుకోవాలి. అన్ని ఆశ్రమాలవారు అన్ని కులాలవారు రుద్రాక్షలు ధరించవచ్చు. ఈ విషయాలన్నీ సాక్షాత్తూ ఆ పరమేశ్వరుడే, సుబ్రహ్మణ్యునికి ఉపదేశం చేసాడు. అష్టోత్తర శతరుద్రాక్ష మాల తో జపం చేసేటప్పుడు  క్షణక్షణం అశ్వమేధం చేసినంతట పుణ్యం వస్తుందని చెప్పాడు.

                అష్టోత్తరశతైర్మాలా రుద్రాక్షేర్ధార్యతే యది.

                క్షణ క్షణేశ్వమేధస్య ఫలం ప్రాప్నోతి షణ్మఖ. (దేవీభాగవతం, అధ్యాయం 4)


                    

    


కొత్తది పాతది