మహర్షికోసం ప్రాణాలు అర్పించిన భార్యాభర్తలు

    

nala damayathi
నలుడు-దమయంతి
హిమాలయ ప్రాంతంలో దట్టంగా పెరిగిన వృక్షాలతో కూడిన ఒక ప్రాంతం ఉంది. అక్కడ ఒక గుహలో ఆగుహుడు అనే కిరాతకుడు తన భార్య ఆగుహితో నివసిస్తున్నాడు. 

ఒకనాటి సాయంకాలం హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న ఒక ఋషి దారి తప్పి ఆ గుహవైపు వచ్చాడు. ఆ ఋషిని చూసిన ఆగుహుడు తన గుహకి తీసుకుని వెళ్ళి ఈ రాత్రికి ఇక్కడే ఉండమని చెప్పి అతిధి మర్యాదలు చేసాడు. ఆ మహర్షి తినటానికి పళ్ళు ఇచ్చి స్వామి మీరు ఈ గుహలోనే విశ్రాంతి తీసుకోండని ఆ ఆగుహుడు గుహ బయటపడుకున్నాడు. ఆగుహుడు నిద్రలో ఉండగా ఒక పులి వచ్చి అతనిని చంపి తినేసింది. అది చూసిన తన భార్య కూడా తన శవం మీద పడి చనిపోయింది. ఈ విషాదాన్ని చూసిన మహర్షి అయ్యో ఎంత పని జరిగింది. నా కోసం నన్ను ఆదరించడం కోసం భార్యా, భర్తలు ఇద్దరూ వాళ్ళ ప్రాణాలర్పించారు అని తన మంత్ర బలంతో అగ్నిని రగిల్చి చితిని పేర్చి ఆ కళేబరాలను వుంచి, ఆ మహర్షి కూడా అగ్ని జ్వాలలతో ప్రచండంగా మండుతున్న చితిలోకి దూకి ఆత్మార్పణ చేసుకున్నాడు. ఆ ఋషిపుంగవునికి ఉండటానికి చోటు, ఆహారం యిచ్చిన ప్రతిఫలంగా మరుజన్మలో ఆగుహుడు నల చక్రవర్తిగా, ఆగుహి దమయంతిగా జన్మించారు. ఆ ఋషి హంసగా పుట్టి పూర్వజన్మలో తన వల్ల విడిపోయిన కిరాత దంపతులను మళ్ళీ కలుపడానికి తోడ్పడ్డాడు.


కొత్తది పాతది