భరధ్వాజ మహర్షి |
నేటి తరంలో ఉపయోగించే యంత్రాలు యొక్క భీజం మన సనాతన ధర్మంలో ఉన్న విషయాల ఆధారంగా తయారుచేయబడినవని ఎన్నోసార్లు నిరూపన అయ్యింది. నిజానికి విమానం కనిపెట్టినది భరధ్వాజ మహర్షి. బరోడాలోని మహారాజ వారి గ్రంధాలయంలో ఉన్న భరద్వాజ మహర్షి రచించిన వైమానిక శాస్త్రం అనే గ్రంధంలో ఆయన తెలిపిన యంత్ర సర్వస్వం లో వివరించబడినది. దానిలోని వైమానిక ప్రకరణమే వెలుగులోకి వచ్చినది. దీనికి బోధానంద అనే ఆయన వ్యాఖ్యానం చేసారు. ఆకాశంలో ఉండే సప్తర్షి మండలంలో ఒకరైన బృహస్పతి కుమారుడే ఈ భరద్వాజ మహర్షి. ఈయన రచించిన యంత్ర సర్వస్వం మొత్తం నలబై అధ్యాయాలు ఉన్న గ్రంధం. కాని చివరిది మాత్రమే మిగిలింది అదే వైమానిక శాస్త్రం. దీనిలో ఎనిమిది అధ్యాయాలు ఉన్నాయి. మొత్తం ఐదు వందల సూత్రాలు ఉన్నాయి. భరద్వాజ మహర్షి విమానాల గురించి వివరిస్తూ ఆ నాటికి ప్రచారంలో ఉన్న శాస్త్రజ్క్షుల పేర్లు తెలుపుతారు. వారు నారాయణ, శౌనక, గర్గ, వాచస్పతి, చాంక్రాయణి, దుంఢినాద అనేవారు. వారు రాసిన శాస్త్రాలు వరుసగా విమాన చంద్రిక, వ్యోమయాన తంత్రము, యంత్ర కల్పము, యానబిందు, ఖేటయాన ప్రదీపక, వ్యోమయాన ప్రకాశము అనేవి ఉన్నాయి.
గ్రద్ధలు మొదలైన పక్షులు ఆకాశంలో ఎగిరిపోయే వేగం ఉంటుంది. దానిని మూడుచేత గుణించగా వచ్చే వేగాన్ని అనుకరించే సామర్ధ్యం కలది. పక్షివలే పోగలిగినది విమానం అని విమానం గురించి వివరిస్తాడు. విమాన రహస్యాలను 32 రకాలుగా భరద్వాజ మహర్షి తెలియజేసారు. విమానాలలో ఉన్న మూడు రకాలను తెలుపుతాడు. అవి మాంత్రిక, తాంత్రిక, యాంత్రిక విమానాలు. ఇవి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగాలలో వాడబడినవి. శకున, సుందర, రుక్మ, మండల, వక్రతుండ అని 25 పేర్లు గల విమానాలు కలియుగంలో ఉండేవట.విమానాలకు విద్యుచ్ఛక్తి తయారుచేసే విధానాలు కూడా పొందుపరచాడు. విద్యుత్తును కొన్ని క్షారాల వల్లను, కొన్ని ద్రావకాల వల్లను పుట్టించవచ్చు అని ఉంటారు భరద్వాజ మహర్షి. దానినే రసాయన విద్యుత్ అంటారు. విద్యుచ్ఛక్తి పుట్టడానికి రౌద్రీదర్పణం అనే దానిని కూడా వివరిస్తారు మహర్షి. ఈ విధంగా మహర్షి విమానాల తయారీ, అందులో వాడే పరికరాలు, విమానాలు నడిపే చోదకులు ధరించవలసిన దుస్తులు, వారు తినే ఆహారం ఎలా ఉండాలి అని కూడా ఈ గ్రంధంలో తెలిపారు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన సనాతన ధర్మం, మన మహర్షులు ఎంత విజ్ఙానం కలిగి ఉన్నారో మనకు అర్ధం అవుతుంది.