|
లక్ష్మణుడు మేఘనాథుని చంపుట |
రామాయణం ఆది కావ్యం వాల్మీకి మహర్షి చేత రచించబడిన మహా గ్రంధం. రామాయణం లో మొత్తం 24వేల శ్లోకాలను కలిగి ఉంటుంది. గాయత్రీ మంత్రం లో ఉండే 24 బీజాక్షరాలు కలిపి మహర్షి ఈ కావ్యం ను రచించడం జరిగింది. రామాయణం మొత్తం పారాయణ గ్రంథము. ప్రతి శ్లోకం, ప్రతి సర్గ, ప్రతి కాండం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రతి శ్లోకం ఒక మంత్రమే రామాయణంలోని జయ మంత్రం , మూలమంత్రం, ఆదిత్య హృదయం వాల్మీకి మహర్షి ఇందులో మనకు అందించారు. "ధర్మాత్మా సత్య సంధశ్చ రామో దాసరధిర్యది పౌరుషేచ ప్రతి ద్వంద్వ నరైనం జహి రావిణం" అనేది మూలమంత్రం. ఈ మూల మంత్రం యుద్ధకాండ లోని రామ రావణ యుద్ధం జరుగుతున్న సమయంలో లో మేఘనా ధుని యుద్ధంలో సంహరించడం కోసం లక్ష్మణుడు ఈ మంత్రాన్ని జరిపించారు.రాముడు పౌరుషం కలిగినవాడు, దాశరధుని సుతుడు, సత్యసంధుడు, ధర్మాత్ముడు అయితే నేను వేసే ఈ బాణంతో రావణుని కుమారుడు మరణించాలి అని లక్ష్మణుడు ఈ మూల మంత్రాన్ని జపించి బాణం వెయ్యగానే మేఘనాథుడు ఆ బాణం తగిలి చనిపోతాడు. అసలు లక్ష్మణుడు ఈ మంత్రాన్ని ఎందుకు జపించవలసిన వచ్చినది అంటే కిష్కింద కాండ లో వాలిని చెట్టు చాటు నుంచి చంపాడు అని రాముడు ధర్మాత్ముడు కాదు అని అంటారని రాముడు ధర్మాత్ముడు సత్యసంధుడు అయితే అని లక్ష్మణుడు అన్నాడు. అలాగే బాలకాండలోని దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు పాయస పాత్ర వచ్చినప్పుడు ఆ పాయసం స్వీకరించడం వల్లనే రాముడు జన్మించాడు. అని లోకం అంటుందని రాముడు దశరథుని కుమారుడు దాశరధి యేఅని లక్ష్మణుడు దాసరధిర్యది అని మంత్రంలో జరిపించడం జరిగినది అలాగే పౌరుష పరాక్రమాలు కలిగిన వాడు అని కూడా జపించాడు. రాముడు ధర్మాత్ముడు, సత్యసంధుడు,దాశరథి కుమారుడు,పౌరుష పరాక్రమాలు కలిగినవాడు అని మనకు ఈ మూల మంత్రం తెలియ చేస్తుంది.