ఇంద్రుడు |
అలా కొంతకాలం గడిచిన తరువాత దేవతలకు, రాక్షసులకి యుద్ధం జరిగి దేవతలు ఓడిపోయి స్వర్గం, ఇంద్రుని సింహాసనం రాక్షసులు ఆక్రమించుకున్నారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మ దేవుని దగ్గరకి వెళ్ళి వారి కష్టాన్ని చెప్తే ఆయన ధదీచి మహర్షి ఎముకలు ఎంతో శక్తి వంతమైనవి ఆయన వెన్నుముక నుంచి ఆయుధాన్ని తయారుచేసుకొని యుద్ధానికి వెళ్ళండి మీకు ఓటమి ఉండదు. అని బ్రహ్మ దేవుడు చెప్తే దేవతలందరూ దధీచి మహర్షి దగ్గరకి వెళ్ళి ఎంతో మర్యాదగా వారిని జరిగినది అంతా చెప్పి మీ శరీరం కావాలి అని చెప్పగా ఆ మహర్షి దేవతల కోసం తన శరీరాన్ని త్యాగం చేసి వాళ్ళకి ఇచ్చారు. దేవతలు ఆ శరీరాన్ని అగ్నిలో వ్రేల్చి ఆ శరీరం కాలిన తరువాత ఆ ఎముకలు తీసి ఆయుధంగా చేసి దానిని ఇంద్రునికి ఇచ్చారు. అదే వజ్రాయుధం గా మారి రాక్షసుల మీద కి యుద్ధం చేసిన ఇంద్రుడు ఓటమి లేని స్థితికి చేరుకున్నారు. ఆ బ్రహ్మజ్ఞానమే, మహర్షి చేసిన శరీర త్యాగం వల్లనే ఇంద్రునికి వజ్రాయుధం అందింది.