పిప్పలాదుడు |
అలా అడవికి వెళ్ళిన పిప్పలాదుడు చాల కాలం ఘోరతపస్సు చేసాడు. కొంత కాలం తరువాత మహాశివుడు ప్రత్యక్షం అయి " నాయనా పిప్పలాదా నీ తపస్సుకు మెచ్చాను. నీకు ఎం వరం కావాలో కోరుకో" అని శివుడు అనగా, పిప్పలాదుడు "పరమేశ్వరా మీరు మూడవ నేత్రమును తెరచి, ఆ దేవతలందరినీ కాల్చి బూడిద చేసివేయాలి. ఇదే నా కోరిక తండ్రి" అని పరమేశ్వరునికి తన కోరిక చెప్పుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ప్రశాంతంగా " నాయనా ఇతరులను సర్వ నాశనం చేయడానికా ఇట్టి ఘోరతపస్సు చేసావు? నాకు నీ మీద జాలి కలుగుచున్నది. మరి, నేను నా మూడవ నేత్రం తెరచిన వెంటనే దేవతలు మాత్రమే కాదు, ఈ బ్రహ్మాండం అంతా ఒక్క క్షణం లో కాలి పోతుంది, ఇంత ఘోరం జరగాలనా నీ కోరిక?" అని పిప్పలాదున్ని ప్రశ్నించాడు. "దానిని నేను పట్టించుకోను, మీరు నా కోరిక తీరుస్తానని చెప్పారు, కనుక నేను కోరిన కోరిక తప్పకుండా తీర్చవలసినది."అని పిప్పలాదుడు పట్టుబట్టాడు. ఈశ్వరుడు "కుమారా! కోపముతో ఉంటున్న వారు దానివల్ల రాబోవు విపరీతముల గూర్చి పట్టించుకోరు. ఇప్పుడు నీవు కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నావు. నీవు నా మూడవ నేత్రము యొక్క తీక్షణ గురించి తెలియక ఇలా మాట్లాడుతున్నావు.నేను కొద్దిగా నా మూడవ కన్ను తెరచి చూపిస్తాను, దాని పర్యవసానం ఏమిటో నీవే చూస్తావు" అని మహేశ్వరుడు తన మూడవ కన్ను కొద్దిగా తెరచి చూసాడు, దానికి పిప్పలాదుడు అగ్నిలో పడినట్లుగా ఒళ్లంతా కాలి పోయినట్లు అయింది. "హా ఈ వేడి నా శరీరమును కల్చేస్తున్నది, తట్టుకోలేకపోతున్నాను, పరమేశ్వరా ఇదేమి పరీక్ష నిన్ను గూర్చి తపస్సు చేసిన వానికి ఇదా నీవిచ్చే బహుమతి? దేవతలను కాల్చమంటే నన్ను కలుస్తునారే? ఇది మీకు న్యాయమా?" అని పిప్పలాదుడు గట్టిగా అరవసాగాడు. ఈశ్వరుడు వెంటనే తన కన్ను మూసి "నాయన నేను నిన్ను దహించడం లేదు. నీవు కోరుకున్నట్లు దేవతలను మాత్రమే దహించుచున్నాను" అనగా "మీరు అబద్దం ఆడుతున్నారు స్వామి మీకు ఇది తగినది కాదు" అని పిప్పలాదుడు మహేశ్వరుని తో అన్నాడు. మహేశ్వరుడు ఆ మాటకి కోపగించుకోలేదు "నేను దేవతలను ధహించానారంభించితిని. నీ శరీరములో ఎంతమంది దేవతలు అధిష్టించి ఉన్నారో నీకు తెలుసా? చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు, నేత్రములకు దేవత సూర్యుడు, నసికాపుటముల దేవతలు అశ్వినీ కుమారులు, మనస్సు యొక్క దేవత చంద్రుడు, వీరు నీ శరీరం లో అధిష్టించి ఉన్న చోట్లనే నేను దహించ ప్రయత్నించాను." అని మానవ శరీరంలోనే దేవతలు అధిష్టించిన ఉంటారని చెప్పేసరికి పిప్పలాదుడు శివుని కాళ్ళపై పడి " ప్రభో!పరమేశ్వరా! నా తప్పును గ్రహించాను. నన్ను క్షమించి, నన్ను ఆశీర్వదించండి." అని తన తప్పును తెలుసుకున్నాడు. పరమేశ్వరుడు భక్తవత్సలుడు కదా! వెంటనే పిప్పలాదున్ని మన్నించి, ఆశీర్వదించాడు " పిప్పలాదా, ఇతరులకు కీడు తల పెట్టువాడు అట్టి కీడును తానె అనుభవిస్తాడు అనే పరమ సత్యమును ఎప్పుడు జ్ఞాపకముంచుకో" అని అదృశ్యమైపోయారు. పిప్పలాదుడు దేవతలు మీద ఉన్న కోపాన్ని పోగొట్టుకుని తనలోనే దేవతలు ఉన్నారనే విషయాన్ని తెలుసుకుని ప్రశాంతంగా తన జీవితాన్ని కొనసాగించాడు.