కర్ణుని దానగుణం

             
krishna with karna
కృష్ణుని తో కర్ణుడు
హస్తినాపురంలో ఒకరోజు అర్జునుడూ, కృష్ణుడూ మాట్లాడుకుంటున్నారు. "కృష్ణా! దాన మిచ్చుటలో కర్ణునకు సాటి ఎరరులేరని ప్రజలు పోగాడుతున్నారు. నేను కూడా అతని లాగా దానమివ్వలేనా ఏమి?" అని అర్జునుడు కృష్ణుని తో అంటాడు. కృష్ణుడు "అది ఏనాటికి సాధ్యము కాదు. కర్ణుని వంటి ధర్మాత్ముడు ఎవరు లేరు ఇకపై ఉండరు." అని అర్జుని తో అనగా, అర్జునుడు అసూయతో "కృష్ణా నీవు నా ప్రాణ స్నేహితునివై కూడా నువ్వు ఆ కర్ణుడినే పోగుడుతున్నవే" అని అంటాడు. దానికి కృష్ణ భగవానుడుకి అర్థం అయి అర్జునుడి అసూయను పోగొట్టడానికి తగిన గుణ పాటం చెప్పాలి అని అనుకుని "పొగడకుండా ఎలా ఉండమంటావు? కావలిస్తే రేపే ఏర్పాటుచేస్తాను. నీవు కర్ణుని కంటే అధికంగా దానం చేసి చూపించు" అని అర్జునికి పరీక్షపెట్టదలచాడు వాసుదేవుడు. "సరే అలాగే కానివ్వు" అని అర్జునుడు తన మందిరానికి వెళ్లిపోయాడు.

                మరుసటి రోజు ఇందుకోసం కృష్ణుడు ఒక బంగారు కొండను, ఒక వెండి కొండను సృష్టించాడు. అర్జున్ని పిలిచి "అర్జునా ఈ రోజు సాయంత్రం లోపు ఈ రెండు కొండలను దానము చేయు చాలు నీవు కర్ణునితో సరితూగగలవు." అని అనగానే " అలాగే దానం చేసి చూపించేదనని" అర్జునుడు ఒక గొడ్డలిని చేత పట్టుకుని, ఆ కొండలను పగులగొట్టి, వచ్చువారికి అందరికి ముక్కలు, ముక్కలుగా దానం ఇస్తూఉన్నాడు. సాయంకాలము వరకు కొండలను పగులగొట్టి ఇచ్చినా, అందులో నాలుగవ వంతు కుడా తరగలేదు. అందువల్ల ఇంకా శీఘ్రంగా ఆ కొండలను పగులగొట్టసాగాడు. "రండి. రండి, మళ్ళీ వచ్చి తీసుకోండి" అని వచ్చిన వారినందరికీ మళ్ళీ మళ్ళీ రమ్మని దానం చేయసాగాడు. అప్పటికి కొండలలో సగం కూడా తరగలేదు. అర్జునుడు అలసిపోయి చేసేదేం లేక పడిపోయి గట్టిగా "కృష్ణా! కృష్ణా!" అని వాసుదేవుని ప్రార్థించాడు. కృష్ణుడు వచ్చి అర్జుని అవస్థ చూసి "అర్జునా! సాయం సమయం దాటింది. ఇంకా దానం చేసి ముగించాలేదా? ఇదే కర్ణుడు అయితే ఒక్క క్షణంలో ఈ కార్యాన్ని ముగించేస్తాడు" అనగానే " ఏడ్చాడు లే అతడు! నీవు కావాలనే అతన్ని పోగాడుతున్నావు. నేను ఇప్పుడు పగులగొట్టి ఇచ్చినంత కూడా అతను ఇవ్వలేడు." అని తన గురించే గొప్పగా చెప్పుకున్నాడు. అప్పుడు వెంటనే "అలాగా! సరే ఇప్పుడే కర్ణుణ్ణి పిలిపించి చూపిస్తా. ఎవరక్కడ? నీవు వెంటనే కర్ణుణ్ణి ఇచ్చటికి తీసుకుని రా!" అని భటునికి ఆంజ్ఞ చేసాడు. ఆ భటుడు సరే ప్రభు అని కర్ణుని దగ్గరికి వెళ్లి వాసుదేవుడు రమ్మని చెప్పి వెంటపెట్టుకుని వాసుదేవుని వద్దకు వచ్చారు. కర్ణుడు వచ్చి శ్రీకృష్ణునికి నమస్కరించి పిలిసిన కార్యం ఏంటని అడుగగా, శ్రీకృష్ణుడు "కర్ణా! సూర్యాస్తమయం లోపల నీవు ఈ రెండు కొండలను దానం చేయాలి" అని కర్ణునికి చెప్పారు. "అలాగే స్వామి ఒక్క క్షణం లో దానం చేస్తాను." అని దారిన పోయే ఇద్దరు బాటసారులను పిలిచి "ఇదిగో, ఈ రెండు కొండలు తలకొక కొండ దానం చేస్తున్నాను. స్వీకరించండి" అనగానే ఆ బాటసారులు ఎంతో ఆనందించి "దానకర్ణుడంటే దానకర్ణుడే" అని వాళ్ళు వెళ్ళిపోయారు. 

               కర్ణుడు శ్రీకృష్ణునితో " కృష్ణా మీరు చెప్పినట్లే మీ ఆజ్ఞను అక్షరాలా పాటించాను. ఇక సెలవు" అని చెప్పి కర్ణుడు కృష్ణుడికి నమస్కరించి అక్కడనుండి వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు "అర్జునా! అసూయపడ్డావు కదా కీర్తి ఊరికే లభిస్తుందా? దేనినై నా సాధించుటకు సులభమైన పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ మార్గము అనుభవస్థులకే అర్థంఅవుతుంది. ఇప్పటికైనా గుర్తించావా కర్ణుడి దాన గుణం ప్రజలు నేను కర్ణుణ్ణి ఊరికే పోగుడుతున్నామని నువ్వు అనుకున్నావు. నీ కళ్ళారా చుసావుకదా కర్ణుని దానగుణం." అని అర్జునుడితో అన్నారు. అర్జునుడు "మాధవా! అంతా అర్థమయింది. నీ పాదపద్మములే శరణ్యం." అని అర్జునుడు కర్ణుడి దాన గుణం కళ్ళారా చూసి ఆశ్చర్యపడ్డాడు.


కొత్తది పాతది