వ్యాసమహర్షి |
ఇన్ని చేసినాను వ్యాసునకు మనశ్శాంతి కలుగక విచారించు ఉండగా నారదుడు వచ్చి, తనకు కలిగిన విచారమునకు కారణం తెలుసుకుని ఎన్ని పురాణములు రచించిననూ అందులో విష్ణు కథలు కొంచెం కొంచెం గా రచించావు, శ్రీహరి మహాత్యములను గ్రహించి భక్తితో అతని లీలా విశేషములను వర్ణించి తన భాదను తొలగించుకుని ఆనందమును పొందమని నారద మహర్షి వ్యాసునకు చెప్పి వెళ్ళిపోయారు.
వ్యాసుడు నారద మహర్షి చెప్పిన విషయమునకు ధ్యానంలో విష్ణుమూర్తి ని స్మరించి అతని మహిమా విషయాలను భాగవత గ్రంధం గా రచించి తన కుమారుడైన శుక మహర్షి చేత చదివించెను. ఆ సమయమునకు అక్కడనే ఉన్న రోమహర్షుడు, అతని పుత్రుడు ఉగ్రశ్రవుడు వ్యాసుని అనుగ్రహముతో భాగవతము విని ఆనందించారు. ఈ విధంగా వ్యాస మహర్షి రచించిన భాగవత గ్రంధం తన పుత్రుడైన శుక మహర్షి ద్వారా మొట్ట మొదట అర్జునుని మనుమడు, అభిమన్యుని పుత్రుడు అయిన పరీక్షిత్తు మహారాజు చే వినబడినది. అలా సూత మహర్షి శౌనకాది మునులకు చెప్పెను.