ఇంగ్లీషువారు ఎక్కడ నుండి వచ్చారు.

                       
లంకలో రామరావణ యుద్దమైనది. వానరుల సహాయంతో రాముడు గెలుపొంది విభీషణునికి పట్టాభిషేకం చేసి తానూ సీత,లక్ష్మణ,గుగ్రీవులతో, వానరులతో, విభీషణుని తో పుష్పక విమానముపై అయోధ్యకు బయలుదేరెను. వానరులు కొందరు శ్రీరామునితో " రామచంద్రా! మాకు ఈ లంకానగరము చాలా బాగా నచ్చింది. మేము కొంతకాలం ఇక్కడే ఉంటాము" అని కోరగా, విభీషణుని అనుమతి తో ఉండమని చెప్పెను. ఆ వానరులు సంతోషించి లంకలో ఉండిపోయి రాక్షస కన్యలను వివాహమాడి వారితో కాపురములు చేసి బిడ్డలను కన్నారు. అయితే, వారు అటు వానరులు కాక ఇటు రాక్షసులు కాకపోయిరి. వారికి వేరే నివాస ప్రదేశములు కావలసివచ్చింది.
                          ఆ వానరులు తమ పిల్లలను వెంటబెట్టుకుని శ్రీరాముని దగ్గరికి వెళ్లి "శ్రీరామా! మేము లంకలో ఉండిపోయి, రాక్షస కన్యలను పెండ్లాడి సంతానము పొందితిమి. ఇప్పుడు వారికి నివాసములు కావలసివచ్చినవి. వీరందరూ ఎక్కడ నివశించవలెనో మీరే నిర్ణయించి చెప్పండి" అని కోరారు. రాముడు వారితో " మీరందరూ పశ్చిమముగా ఉన్న ద్వీపములను ఆక్రమించి రాజ్యపాలన చేయుచు సుఖముగా జీవించండి. సంస్కృత భాష మూలముగా ప్రాంతీయ భాష మాట్లాడుచూ రాజ్యపాలన వ్యవహారములు ఆ భాషలోనే చేయుచుఉండవచ్చు." అని వారిని పశ్చిమ దిక్కుకు వెళ్ళమని చెప్పారు. వారినే మురుండులు లేక గరుండులు అని పిలువబడి చాల కాలము రాజ్యపాలన చేసెను. కలియుగములో నాలుగువేల ఐదువందల సంవత్సరములు దాటినా తరువాత వర్తకము పేరుతో భారత దేశమునకు వచ్చి పరస్పరము కలహాములతో చికాకుపడుచున్న చిన్నచిన్న రాజులను లొంగదీసుకుని ఆ మురుండులు మొత్తము భారతదేశమును ఆక్రమించి పరిపాలన చేయుదురు. ఆ మురుండులే ఆంగ్లేయులు. 
                  వీరి రాణి వికటావతి ( విక్టోరియా) భారత దేశమును పాలించును. సప్తమరాజు (ఎడ్వర్డు VII), పంచమరాజు (జార్జ్ V), షష్ఠ రాజు (జార్జ్ VI) మున్నగువారు సుమారు మూడువందల ఏండ్లు పరిపాలించెదరు. ఆ తరువాత భారతీయులు స్వతంత్రులై తమ రాజ్యమును తామే పాలించుకొందురు. అని భవిష్య పురాణం లో ఆంగ్లేయుల వర్ణన గురించి సూత మహర్షి, శౌనకాది మహర్షుల తో చెప్పబడినది.
కొత్తది పాతది