దేవునికి నీడనిచ్చిన సుందరి

                   
sundari
సుందరి
వేయి సంవత్సరములకు పూర్వం తంజావూరును రాజధానిగా చేసుకుని తమిళ దేశము నంతటిని పాలించిన రాజరాజ చోళ చక్రవర్తి తంజావూరు లో ఒక పెద్ద ఆలయమును కట్టించుటకు పూనుకున్నాడు. ఆలయ నిర్మాణం మొదలయింది ఎండ, వాన, ఆహారము, విశ్రాంతి వీటన్నింటినీ చూడక వందల మంది శిల్పులు ఆ ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నారు. అదే ఊరిలో సుందరి అనే ఒక మసులమ్మ నివసిస్తుంది. ఒక రోజు ఆ ముసలమ్మ ఇంటిలో దిగాలుగా కూర్చొని ఆలయం కట్టడానికి రోజంతా ఎంతో మంది కష్టపడి రాత్రి, పగలు పనిచేస్తున్నారు. నేను ఏం చేయలేకపోతున్నాను అని ఎంతో భాదపదుతుండగా ఒక ఆలోచన వచ్చి పనిచేస్తున్న ఆ శిల్పులకు రోజూ మజ్జిగ ఇవ్వటమే పరమేశ్వర సేవ గా చేస్తే బాగుంటుంది అని అనిపించింది సుందరికి. వెంటనే తన ఇంట్లో ఉన్న మజ్జిగను తీసుకుని వెళ్లి ఆలయం లో పనిచేస్తున్న వారికి ఇచ్చింది. అలాగే రోజూ ఇవ్వటం చేస్తూఉండేది. అలా కొంతకాలం గడిచిన తరువాత ఆలయ నిర్మాణం పూర్తి కావస్తుంది. ఆలయ విమానము లో గర్భగృహం పై ఉంచవలసిన శిల్పము ఒక్కటే ఇంకా చేయటానికి తగిన శిలను వెదుకుతున్నాడు ప్రధాన శిల్పి. ముసలమ్మ సుందరి ఆ ఆలయానికి ఒక్క చిల్లీగవ్వ కూడా ఇవ్వలేకపోయానని ఎంతో బాధపడుతుంది. అప్పుడు ఆమె గుడిసె ముందు ఎంతోకాలంగా ఉన్న ఒక పెద్ద శిలను ఆ ఆలయ ప్రదాన శిల్పికి చెప్పి ఆ విగ్రహం చేయుటకు ఈ శిల పనికివస్తుందేమో చూడమని చెప్పింది. ఆ శిల్పి వెళ్లి చూచి పనికి వస్తుంది అని చెప్పి ఆ శిలను తీసుకుని శిల్పం చెక్కి ఆలయ నిర్మాణం పూర్తిచేస్తాడు. కుంభాభిషేకం రోజు రాజరాజ చోళ చక్రవర్తి తాను నిర్మించిన బ్రహ్మాండమైన ఆలయమును చూసి తనే మురిసిపోతూ పరమేశ్వరునికి ఇంతటి అధ్బుత ఆలయమును ఎప్పుడూ ఏ చక్రవర్తి కట్టించి ఉండలేదు అని అనుకుంటాడు. మహద్బుతంగా ఆలయ కుంభాభిషేకం అవుతుంది.
               ఆ రాత్రి చక్రవర్తికి కలలో పరమేశ్వరుడు కనిపించి "రాజా! కొత్త ఆలయములో సుందరి అనే ముసలమ్మా నిర్మించి యిచ్చిన నీడలో నివసించుటలో నాకు ఎంతో ఆనందంగా ఉంది" అని చెప్తారు. వెంటనే రాజుకు మెలకువ వస్తుంది " నేను పరమేస్వరునికై ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాను. కానీ, ఆయన సుందరి నిర్మించి ఇచ్చిన నీడలో నివసించుటలో తృప్తి చెందుతున్నానని అనుటలో ఆంతర్యమేమి? ఆ సుందరి ఎవరు? అనుకున్నాడు. తరువాతి రోజు మంత్రులను పిలిపించి విచారించిన తర్వాత ఆ ముసలమ్మను చూడడానికి తనే స్వయంగా ఆ ముసలమ్మను చూడటానికి బయలుదేరివెళ్తారు. ఆ ముసలమ్మ సుందరి ఇంటికి వెళ్లిన రాజు " అవ్వా! పరమేశ్వరునికి నీవు ఎలాంటి సేవ చేసావో తెలియదు. నీవు ఇచ్చిన నీడలో తాను ఆనందంగా ఉంటున్నానని ఆ భగవంతుడు నాకు కలలో కనిపించి చెప్పాడు." అని ఆ ముసలమ్మతో అంటాడు. ఆ ముసలమ్మ "అయ్యా! ఈ బీదరాలు ఎట్టి సేవ చేయలేదు. ఎండాకాలం లో ఆలయ నిర్మాణం చేస్తున్న శిల్పులకు మజ్జిగ ఇచ్చాను. నా ఇంటి ముందు పడి ఉన్న పెద్ద శిలను గోపుర విమానమునకు ఇచ్చాను. అంతే " అని రాజుతో తను చేసిన పని చెప్తుంది. చక్రవర్తి ముసలమ్మ కు భక్తి తో నమస్కరించి "భగవంతుడు ప్రేమ పిడికిలో చిక్కుకునే పర్వతమని గ్రహించితిని." అని చెప్పి అక్కడనుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటికి తంజావూరులో సుందరి పేరుతో ఒక తటాకముంటున్నది. సుందరి నివసించిన గుడిసె వద్ద తంజావూరు నగరపాలక కార్యాలయం ఉంటున్నది.
కొత్తది పాతది