దసరా నవరాత్రి తొమ్మిదవ రోజు సిద్ధధాత్రిదేవి

 


సిద్ధిధాత్రిః-

సిద్ధగంధర్వయాక్షధ్యైః అసురైరమరైరపి

సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ


నవరాత్రులలో ఆఖరి రోజు ఆశ్వీయుజ శుద్ధ నవమి నాడు దుర్గాదేవిని సిద్ధిధాత్రిదేవి గా ఆరాధించి పూజలు చేస్తారు. సిద్ధిధాత్రి అంటే సర్వసిద్ధులను ప్రసాదించే తల్లి అని అర్థం. ఈ అమ్మవారు కమలం పై ఆసీనురాలై ఉండి రెండు చేతులలో శంఖము, చక్రము, మరో రెండు చేతులలో గద, కమలము పట్టుకుని నాలుగు చేతులు కలిగి ఉంటుంది. విశ్వం ఆవిర్భావం అవ్వకముందు సృష్టి అంతా గాఢాందకారం లో ఉంటుంది. అప్పుడు ఒక వెలుగు వచ్చి ప్రపంచం అంతా ప్రసరిస్తుంది. అందులో నుండి మహాశక్తి ఆవిర్భవిస్తుంది. ఆ మహాశక్తి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను సృష్టించి, వారి చేయవలసిన కర్తవ్యాలు తెలుసుకోవడం కోసం తపస్సు చేయమని చెప్తుంది. త్రిమూర్తులు అమ్మవారు చెప్పినట్టుగా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. అప్పుడు అమ్మవారు సిద్ధిదాత్రి గా వారి ముందు ప్రత్యక్షం అయ్యి సరస్వతీ, లక్ష్మీ, పార్వతీదేవీలను సృష్టించి, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ఇస్తుంది. బ్రహ్మ సృష్టి చేయాలని, విష్ణువును ఆ సృష్టి ని రక్షించమని, మహేశ్వరునికి కాలానుగణంగా సమయం అయిపోయినప్పుడు నాశనం చేయమని చెప్పి,  వారి శక్తులు వారి భార్యల రూపంలో ఉంటుందని, మీరు చేసే కర్తవ్యాలకు వారు మీకు సహాయం చేస్తారని చెప్పి, వారికి దైవిక అద్భుత శక్తులను కూడా అందించి, ఆ శక్తులు వారి విధులు నిర్వహించడానికి కూడా ఉపయోగపడుతుంది, అని వారికి అష్టసిద్ధులు ప్రసాదింస్తుంది. వాటి ద్వారానే త్రిమూర్తులు ఈ సృష్టిని కొనసాగిస్తున్నారు. అలా సిద్ధిధాత్రి అమ్మవారు త్రిమూర్తులను సృష్టించి వారికి సకల సిద్ధులు ప్రసాదించి ఇచ్చింది. ఈ సిద్ధిదాత్రి దేవత అష్టసిద్ధులకు అధిపతి. ఈ అమ్మవారిని పూజిస్తే అష్ఠసిద్ధులు లభిస్తాయి. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సిద్ధిదాత్రి దేవి కేతు గ్రహానికి అధిపతిగా ఉంటుంది. ఇది నవ రాత్రులలో ఆఖరి రోజు సిద్ధిదాత్రి అమ్మవారి అవతార విశేషాలు. ఈ నవరాత్రులు దుర్గాదేవి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మనకు మనకు సఖల, సుభాలు కలిగించి ఆనందంగా ఉండే అవకాశాన్ని కల్పించింది.  ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క ప్రాముఖ్యత కలిగి మనకు ఉన్న సకల కోరికలు, సిద్ధులు ప్రసాదిస్తుంది అమ్మవారు.

కొత్తది పాతది