పోతన భాగవతం

బమ్మెరపోతన
భాగవత పద్యాలు పోతన భాగవతం, తెలుగు భాగవతం గా ప్రసిద్ధికెక్కిన శ్రీమదాంధ్రభాగవతం గురించి తెలియని తెలుగువారు ఉండరు. వ్యాస మహర్షి సంస్కృతంలో రచించిన భాగవతాన్ని మన తెలుగు వారయిన బమ్మెర పోతన గారు సరళంగా తెలుగు భాషలో అనువదించారు. ఈయన రచించిన తెలుగు పద్యాలు చాలా సరళంగా పలకగలిగే విధంగా ఉండడం మనకు చదువుకునే అవకాశం కలిగింది. బమ్మెర పోతన జనగామ జిల్లాలో బమ్మెర గ్రామంలో జన్నించారు. ఆయన తల్లి లక్కమాంబ, తండ్రి కేసయ్య. పోతన భాగవతాన్ని రచిస్తూ సాక్షాత్తూ ఆ శ్రీరాముల వారికి అంకితం ఇచ్చారు. ఒకరోజు గోదావరి నదిలో స్నానం చేసి ధ్యానం చేస్తుండగా శ్రీరాముడు కనిపించి వ్యాసమహర్షి రచించిన భాగవతాన్ని తెలుగులో రాయమని ఆదేశించారు. ఓరుగల్లు కి రాజు అయిన సింగరాయ భూపాలుడు రచించిన తెలుగు భాగవతాన్ని తనకి అంకితం ఇవ్వమిని అడిగితే కాదని ఆ శ్రీరామునికి అంకితం ఇచ్చారు. అప్పుడు సింగరాజు భూపాలుడు కోపంతో మొత్తం తాళపత్రాలు అన్నీ భూమిలో పాతిపెట్టారని, తరువాత బయటకు తీసేసరికి కొన్ని చెదలు పట్టి పోయాయని, పోతన మరణానంతరం కొంతకాలానికి వారి కొడుకు పూజామందిరంలో ఈ గ్రంధాన్ని కనుగొన్నాడు. పోతన శిష్యుడు, తనతో ఉన్న గంగన తో కలిసి పాడైపోయిన భాగాలు పూర్తిచేసారని రకరకాల కధలు ప్రచారంలో ఉన్నాయి. ఈ గ్రంధంలో మొత్తం 10061 పద్యగద్యాలు ఉన్నాయి. వీరిది వ్యవసాయ కుటుంబం. ఎప్పుడు వ్యవసాయం చేసేవారో, ఎప్పుడు గంఠం పట్టుకుని రచించేవారో అని కవులు అనేవారు. పోతన గారు యవ్వనంలో ఉన్నప్పుడు సింగభూపాలుని ప్రియురాలి మీద ఒక దండకాన్ని రాసారు. అదే భోగినీ దండకం. ఈ దండకమే తెలుగులో మొదటి దండకం అని భావించేవారు. దక్షయజ్ఞం సందర్భంగా శివుని పరాక్రమాన్ని వివరిస్తూ వీరభద్ర విజయం అనే పద్య కావ్యాన్ని కూడా రాసారు. దానశీలము అనే ఇంకొక పద్యాన్ని కూడా రాసారు. ఈ భాగవతం లో ఉన్న పద్యాలు కృష్ణజననం, క్షీరసాగరమథనం, రుక్మిణీ కళ్యాణం, ప్రహ్లాద చరిత్ర, గజేంద్రమోక్షం, వామన చరిత్ర, కుచేలోపాఖ్యానము మొదలైన గట్టాలు ఎంతో రమ్యంగా తెలుగులోకి రచించడం జరిగింది. ఈ భాగవతం లో పద్యాలు పిల్లలు కూడా చెప్పుకునే విధంగా కొన్ని పద్యాలు ఏరి కోరి తీయటం జరిగింది. ఇవి మీరు, మీ పిల్లలు కూడా నేర్చుకుని పఠిస్తారని కోరుకుంటూ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే ఆ పద్యాలు తాత్పర్యంతో సహా ఇవ్వటం జరిగింది. ఇంతటి మహత్ గ్రంధం లో ఉన్న కొన్ని పద్యాలనైన మనం చదివి మననం చేసుకుంటూ ఉంటే మనకు ఈ గ్రంధాన్ని అందించిన బమ్మెర పోతన గారికి కొంచెం అయిన రుణం తీర్చుకునేటట్టు అవుతుందని నా అభిప్రాయం. ధర్మోరక్షతి రక్షితః.


కొత్తది పాతది