ఇప్పటికీ బ్రతికి ఉన్న కౌరవసేనాధిపతి

 కౌరవులకు, పాండవులకు గురువుగా బాద్యతలు నిర్వహించి, కురుక్షేత్రంలో కౌరవుల తరపున పాండవులతో యుద్ధం చేసి, కౌరవుల రాజ్యానికిి కొన్నాళ్ళపాటు చక్రవర్తిగా పాలించి, భీముడు, అర్జునుడు, సహదేవుడు, సాత్యకీ లాంటి మహావీరులతో యుద్ధం చేసి, శిఖండినీ, ద్రౌపది సోదరుడు అయిన యుదామన్యుని చంపి పురాణకథలలో మరణం లేకుండా బ్రతికి ఉన్న వ్యక్తులలో ఒకరు "కృపాచార్యుడు." ఇతని పుట్టుకే విచిత్రంగా జరిగింది. గౌతమ మహర్షికీ, అహల్యకి పుట్టిన శరధ్వందుడు ఒకానొకనాడు అరణ్యంలో తపస్సు చేస్తున్నాడు. ఇతను విలువిద్యలో ఎంతో ప్రవీణుడు. ఇతను తపస్సు చేసి వరాలు పొందితే ఇబ్బంది వస్తుంది అని తలచి ఇంద్రుడు, అప్సరస ను శరధ్వందుని తపస్సు భంగం చేయమని పంపిస్తాడు. అప్సరస తపస్సు చేస్తున్న శరధ్వందుని దగ్గరకు వచ్చి తన అంద చందాలను చూపించి తనను వశపరచుకోడానికి చూస్తుంది. శరధ్వందుడు అప్సరసును చూసి తను అదుపు తప్పి తన వీర్యాన్ని వదిలేస్తాడు. తను చేసిన తప్పుకు సిగ్గుపడి అక్కడనుండి ఇంకా లోతైన అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ పడిన వీర్యం మొక్కలపై పడి ఆవీర్యం రెండు బాగాలుగా పడుతుంది. ఆ భాగాలనుండి ఒక అబ్బాయి, ఒక అమ్మాయి పుడతారు. భీష్ముని తండ్రి అయిన శంతనుడు అడవికి వేటకు వచ్చి ఆ ఇద్దరి పిల్లలను చూసి తనతో పాటు రాజ్యానికి తీసుకుని వెళ్తాడు. శంతనుడు తన కృపతో (జాలిపడి) ఆ పిల్లలను చేరదీసాడని, అబ్బాయికి "కృప" అని అమ్మాయికి "కృపి" అని పేర్లు పెడతారు. కృప పెద్దవాడు అవుతున్నప్పుడు శరధ్వందుడు వచ్చి కృప కు సకల విద్యలు నేర్పిస్తాడు. కృప విలువిద్యలో ఎంతో గొప్ప వీరుడు అవుతాడు. తరువాత భీష్ముడు కృప ను పాండవులకు, కౌరవులకు గురువుగా నియమిస్తాడు. వారికి ఆచార్యుడు కాబట్టి కృపాచార్యుడు అని పేరు వచ్చింది. అమ్మాయి గా పుట్టిన కృపిని ద్రోణాచార్యునికి ఇచ్చి వివాహం చేస్తారు. వీరికి పుట్టిన సంతానమే అశ్వద్థామ.

దుర్యోధనుడు కృపాచార్యున్ని కురుక్షేత్ర యుద్దంలో కౌరనసైన్యానికిి అదిపతిగా నియమిస్తాడు. తన పరాక్రమం చూపించి పాండవుల వైపు ఎంతోమందిని చంపి గొప్ప వీరునిగా భీష్ముని దగ్గర ప్రశంసలు అందుకున్నాడు కృపాచార్యుడు. 18వ రోజు యుద్దంలో భీముడు దుర్యోధనున్ని చంపిన రోజు రాత్రి అశ్వధ్థామ, కృతవర్మ తో కలిసి పాండవుల విడిది దగ్గరకి వెళ్ళి గుడారాలు కాల్చి మిగిలిన పాండవుల సైన్యాన్ని చంపేస్తారు. యుద్దం ముగిసాక దృతరాష్ట్రడు, గాంధారీ అడవులకు వెళ్తూ వాళ్ళతో కలిసి వెళ్ళడానికి నిశ్చయించుకుంటే దృతరాష్ట్రుడు తనని ఉండమని రాజ్యానికి చక్రవర్తిని చేెస్తాడు. కొన్నాళ్ళ తరువాత పాండవులందరూ హిమాలయాలకు వెళ్తున్నప్పుడు అర్జునుని మనవడు, అభిమన్యుని కొడుకు అయిన పరీక్షిత్తునికి గురువుగా ఉండమని చెప్పి వెళ్ళిపోతారు. తన బాధ్యతలను పూర్తి చేసానని అనుకున్న కొంతకాలానికి కృపాచార్యుడు కూడా తన మిగిలిన జీవితం తపస్సు చేసుకోవాలని భావించి తను కూడా అడవులకు వెళ్ళిపోతాడు. కృపాచార్యుడు బ్రహ్మయొక్క అవతారం అని సన్యాసి కాబట్టి అతను 8వ తరం సప్తర్షులలో ఒకడు కాబట్టి ఆయన చిరంజీవిగా మరణం లేని వాడుగా ఉంటాడు.

కొత్తది పాతది