భక్త సూరదాసు

                   
సూరదాసు పుట్టుకతో గుడ్డివాడు. కానీ శ్రీకృష్ణ భక్తులలో ప్రముఖుడు. శ్రీకృష్ణ భగవానునికి అత్యంత ప్రీతిపాత్రుడు. సూరదాసు ఒకసారి తీర్థయాత్రలకు బయలుదేరాడు. అందుడైనందువల్ల దారిలో ఉన్న ఒక పాడుబడ్డ బావిలో పడిపోయాడు. అప్పుడు సూరదాసు " ఆపద్భంధవా! అనాధరక్షకా! కృష్ణ ! భక్తవత్సలా అంధుడైన నన్ను నా ఆరాధ్యదైవమైన నువ్వే నన్ను రక్షించాలి." అని శ్రీకృష్ణున్ని ప్రార్థించాడు. అలా ఒక వారం రోజులు గడిచిపోయింది. అయినా కూడా సూరదాసు శ్రీకృష్ణున్ని ప్రార్తిస్తూనే ఉన్నాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు కరుణించి సూరదాసు ని బావి లోంచి బయటికి తీసాడు. అలా బయటికి వచ్చిన సూరదాసుకి రాధాకృష్ణుల మాట్లాడుకోవటం  వినబడింది. సూరదాసు "గోవిందా! నీవును, రాధా మాత నాకు దగ్గరలోనే వుంటూ ఉన్న నేను మిమ్ము దర్శించలేక పోతున్నాను కదా! నేను ఎంతటి దురదృష్టవంతున్ని" అని సూరదాసు తన భాదను శ్రీకృష్ణునికి చెప్పుకున్నాడు. భగవానుని తనివితీరా దర్శించడానికి కళ్లులేకపోయాయి కదా అని సూరదాసు మనస్సులో చాల భాదపడ్డాడు. భక్తుని ఆవేదన భగవంతునికి అర్థమయింది. శ్రీకృష్ణుడు మయా లోలోడు కదా. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రాధ తో " రాధా! సూరదాసు సమీపానికి వెళ్ళకు అతడు నిన్ను పట్టుకున్నాడంటే తర్వాత ఎంతటికీ వదలదు." అని అన్నాడు. రాధా మాత "అలాగా అయితే నేను వెంటనే వెళ్లి తీరుతాను." అని సూరదాసు దగ్గరకు వెళ్ళింది. వెళ్లి సూరదాసు తో రాధా మాత " నా పాదములు పట్టుకుంటారా ఏమిటి?" అని సరదాగా సూరదాసు తో అన్నది. అప్పుడు సూరదాసు " నేను గుడ్డివాడిని కదా నేను ఎలా పట్టుకోగలను" అని అన్నాడు. రాధాదేవి సూరదాసు వెనకగా వెళ్లి తన పాదములతో మృదువుగా సూరదాసు ను ముట్టుకుంది. ఈ విషయాన్ని సూరదాసు కు తెలియజేయాలని శ్రీకృష్ణుడు "రాధా ఆయన తన వీపుగా చేతులు చాచి నిన్ను పట్టుకుంటాడేమో జాగ్రత్త" అని అనగానే సూరదాసు "ఓహో అదా సంగతి మీరు నా వెనకాలే నిలబడి ఉన్నారా" అని వెంటనే సూరదాసు వెనుకకు తిరిగి ఆమె పాదములను పట్టుకున్నాడు. రాధ తప్పించుకుంది కాని ఆమె కాలి గజ్జెలు సురదాసుకు దొరికిపోయాయి. " నా కాలి గజ్జెలు నాకు ఇచ్చేయండి. నేను గోపికలతో కలసి నాట్యం చేయాలి." అని రాధ సూరదాసు ను అడిగింది. సూరదాసు "ఇవి మీ కాలి గజ్జెలా నాకు కళ్ళు కనపడవు కదా నాకు ఎలా తెలుస్తుంది. నేను చూడగలిగినప్పుడే కదా ఈ గజ్జెలు మీవో కాదో తెలిసేది" అని తెలివిగా సమాధానం చెప్పాడు సూరదాసు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు సూరదాసు కు కళ్ళు కనిపించేటట్లు అనుగ్రహించాడు. సూరదాసు శ్రీకృష్ణున్ని, రాధా మాత ను చూసినందుకు ఎంతో ఆనందిచాడు. తండ్రి నీ దర్శన భాగ్యం కలిగిందా అని పరవశించిపోయాడు. శ్రీకృష్ణ భగవానుడు సూరదాసు తో " సూరదాసు నీకు ఏం వరం కావాలో కోరుకో అని" అన్నాడు. అప్పుడు సూరదాసు మీరు ఇవ్వలేరు. అన్నాడు. నీవు కోరిన ఏ వరాన్ని అయిన నేను తీరుస్తాను కోరుకో అన్నాడు శ్రీకృష్ణుడు. సూరదాసు, శ్రీ కృష్ణుడి పాదాలపై పడి "శ్రీ కృష్ణ! వాసుదేవా! మిమ్ము దర్శించిన ఈ కళ్ళతో ఇంక ఈ ప్రపంచంలో మరి దేనినీ చూడాలని లేదు. కాబట్టి మళ్ళీ నన్ను గుడ్డివానిగా చేయండి. ఇదే నా కోరిక" అని సూరదాసు శ్రీకృష్ణున్ని వేడుకున్నాడు. తను కోరిన కోరికకు రాధాదేవి కళ్ళు చెమ్మగిల్లాయి. సూరదాసు. శ్రీకృష్ణుడు అలాగే కాని అని మళ్ళీ సూరదాసు కోరిక నెరవేర్చాడు. సూరదాసు మళ్ళీ అంధుడైపోయాడు. సూరదాసు ను ఆశీర్వదించి శ్రీకృష్ణుడు, రాధాదేవి అదృశ్యమైపోయారు. సూరదాసు ఎప్పటిలాగే శ్రీకృష్ణున్ని తలచుకుంటూ కాలం గడిపేసాడు.


కొత్తది పాతది